మోపాల్ మండలంలోని సిరిపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రచించిన లేఖల సంకలనం సిరి లేఖలు పుస్తకాన్ని బుధవారం నాడు జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్ ఆవిష్కరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మక రంగంలో రాణిస్తూ తమ ఆలోచనలను సరికొత్తగా ఆవిష్కరిస్తూ మునుముందుకు వెళ్లడం సంతోషదాయకమని ఈ విషయంలో సిర్పూర్ విద్యార్థులు ఒక అడుగు ముందుకేసి లేఖల రూపంలో తమ సృజన ఆలోచనలను పంచుకోవడం అభినందనీయమని ఈ విద్యార్థులకు తెలుగు సృజన మార్గదర్శిగా వ్యవహరిస్తున్న తెలుగు ఉపాధ్యాయులు, సిరి లేఖలు పుస్తక సంపాదకులు డాక్టర్ కాసర్ల నరేష్ రావు ను అభినందించారు విద్యార్థులలో దాగివున్న ప్రతిభను వెలికి తీసి మంచి అవకాశాలు కల్పిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి సత్యనారాయణ ను అలాగే ఉపాధ్యాయ బృందాన్ని డిఈవో ఈ సందర్భంగా అభినందించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో డిసిఇబి సెక్రెటరీ సీతయ్య గణితఫోరం బాధ్యులు కె. కాంతారావు ,టిటియు జిల్లా అధ్యక్షులు లాటికర్ రాము, పుస్తక రూపకర్త చింతల శ్రీనివాస్ గుప్త, ఉపాధ్యాయులు మోహన్ ,అక్బర్ బాషా, డాక్టర్ హజారే శ్రీనివాస్ మరియు పుస్తక సంపాదకులు డాక్టర్ కాసర్ల నరేష్ రావు , సిర్పూర్ పాఠశాల నుంచి విచ్చేసిన విద్యార్థులు అక్షయ ,రచన, నందిని ,శ్రీజ ,తబస్సుం, వరలక్ష్మి ,మాధురి ,హిందూ శ్రీ ,రజిత ,మేఘన, హరిణి, గంగోత్రి పాల్గొన్నారు. ఈ సిరిలేఖలు పుస్తకావిష్కరణ సందర్భంగా డీఈఓ ను సిరిపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. డీఈవో ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణను శాలువ కప్పి సన్మానించారు.
వైభవంగా సిరి లేఖలు పుస్తకావిష్కరణ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి