ప్రకృతి ఒడిలో ....!!: ---డా.కె.ఎల్.వి.ప్రసాద్.

 చలి చల్లగా జారుకున్టొంది
ఉదయం కాస్సేపు
తనువునుతాకి 
తక్షణం-
మటుమాయం అవుతుంది !
రగ్గులు -స్వేటర్లు 
బీరువాలో -
ముసుగేసుకున్నాయ్....!
గీజర్ల జోరుతగ్గి..
కూలర్ల హోరు
వూపందుకుంటున్నది...
వేసవిని ఎదుర్కోడానికి 
వ్యూహం 
రూపుదిద్దుకుంటుంది !
శిశిరం తోకముడిచి ...
వసంతానికి -
స్వాగతం పలుకుతున్నది !
ఋతువు ఏదైనా ....
అవసరానికితగ్గట్టు 
సర్దుకుపోయేగుణం 
మనిషికి -
ప్రకృతిప్రసాదించిన 
గొప్ప వరం సుమా ....!!
                 ****

కామెంట్‌లు
చాలా బాగా వ్రాశారు సార్ సందర్భానికి తగిన కవిత ‌హృదయపూర్వక అభినందనలు మీకు 💐👏👌💐👏👌💐👏👌💐🙏💐
చాలా బాగా వ్రాశారు సార్ సందర్భానికి తగిన కవిత ‌హృదయపూర్వక అభినందనలు మీకు 💐👏👌💐👏👌💐👏👌💐🙏💐
చాలా బాగా వ్రాశారు సార్ సందర్భానికి తగిన కవిత ‌హృదయపూర్వక అభినందనలు మీకు 💐👏👌💐👏👌💐👏👌💐🙏💐