హోలీ అంటే..?
కమనీయమైన...
రమణీయమైన రంగుల రాసకేళీ...
ఈ జగమంతా రామమయం అన్నట్టు
దీపావళి పర్వదినం వెలుగులమయం
ఈ హాలీ పర్వదినం సప్తవర్ణాలమయం...
రాధామాధవుల రసరమ్య రాగాలమయం
హోలీ అంటే..?
రంగుల ఉత్సవమే...
ఉత్సాహం ఉల్లాసమే పిల్లల కోలాహలమే
ఒకరిపై ఒకరు చల్లుకునేది రంగునీళ్ళే కానీ
తడిసేది తనువు...మురిసేది మనసు
కురిసేది స్నేహసంబంధాల విరిజల్లులే...
విరిసేది చిరుమందహాసాల...
ఆనందాల ఆప్యాయతల హరివిల్లులే...
హోలీ అంటే..?
రాగద్వేషాలకు కులమతాలకతీతంగా
ప్రేమతత్వం సామాజిక సమానత్వంతో
అంబరాన్నంటే సంతోషాల సంబరాలే...
హోలీ అంటే..?
మురిపించే మురళీగానమే
వసంతమాసంలో కొమ్మ కొమ్మలో
కోయిలమ్మల కుహూకుహూ రాగాలే...
సుఖదుఃఖాలే...శాంతిసౌభాగ్యాలే..
చెడుపై మంచి పూరించే శంఖారావమే...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి