ఎవరికోసం వచ్చావే
వెన్నెలా
ఎందుకోసం వెదుకుతున్నావే
వెన్నెలా
ఎంత అందం ఒలకబోస్తున్నావే
వెన్నెలా
ఎంత ఆనందం అందిస్తున్నావే
వెన్నెలా
ఏపడతుల నవ్వులు చిందుతున్నావే
వెన్నెలా
ఏపువ్వుల సౌరభాలు చల్లుతున్నావే
వెన్నెలా
ఎవరి వెలుగులు ప్రసరిస్తున్నావే
వెన్నెలా
ఎవరి చల్లదనం వెదజల్లుతున్నావే
వెన్నెలా
ఎవరిని పిలుస్తున్నావే
వెన్నెలా
ఎవరికి వలవేస్తున్నావే
వెన్నెలా
ఎవరికోసం చూస్తున్నావే
వెన్నెలా
ఏమి అందించాలనుకుంటున్నావే
వెన్నెలా
ఎందరి ఎదలను దోస్తున్నావే
వెన్నెలా
ఎన్నెన్ని కోర్కెలు రేపుతున్నావే
వెన్నెలా
ఎన్ని హృదులను తడుతున్నావే
వెన్నెలా
ఎన్ని మదులను మురిపిస్తున్నావే
వెన్నెలా
ఎంతసేపు ఊరిస్తావే
వెన్నెలా
ఎంతసమయం విహరించమంటావే
వెన్నెలా
ఎందుకో నీతలపులు వీడలేకున్నానే
వెన్నెలా
ఏమిటో నీరూపము మరువలేకున్నానే
వెన్నెలా
నాదరికి రావే
వెన్నెలా
నాకుదారిని చూపవే
వెన్నెలా
నాలక్ష్యాలు చేర్చవే
వెన్నలా
నాకాంక్ష్యలు తీర్చవే
వెన్నెలా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి