చిత్రమైన ఉగాది:- డా.చీదెళ్ళ సీతాలక్ష్మి-హైదరాబాదు
చైత్ర మాసంలో వస్తున్న
చిత్రమైన ఉగాది లక్ష్మీ
సర్వశుభాలు జరగాలని
శ్రీ విశ్వావసు నీకు స్వాగతం 
ఫాల్గుణంతో ముగిసే క్రోది నామా
నీ కిదే మా వీడుకోలు!!

ఊరు వాడ వీధి పట్నం
తల్లిదండ్రులు పిల్లలతో కూడి
చేసుకుంటున్న తొలి పండుగ
కలిసుంటే కలోగంజో
చిత్రంగా ఇంటిల్లి పాదీ!!

షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి
తినేవారికది సంజీవని
ఆరు తీర్ల ఆనందాలు అగచాట్లు
చేదు అనుభవమాయె అందరికీ
చుట్టపక్కాలకు చరవాణిలోనే స్వాగతవచనాలు
కవిసమ్మేళనాలు
దూర దర్శనంలోనే పంచాంగ శ్రవణాలు
అరచేతిలోనే వైకుంఠం!!

సెల్లులోనే సొల్లు కబుర్లు
ఇల్లులోనే  సమస్తం
గాలిలోనే అచ్చట్లు ముచ్చట్లు!!

కాలంతోనే ప్రయాణం
విశ్వాన్ని మోస్తున్న వాసు
విశ్వానికి వసుతో వసతి
షడ్రుచులు అంటే ఆరు కాంతులు
పంచభూతాలతో మిలితమైన మనోవిజ్ఞాన కాంతి
సాంకేతిక శాంతి
తెలుగు వారికి తొలి ఉగాది
శ్రీ విశ్వావసుకు స్వాగతం!!
సర్వేజనులకు శుభం శుభం!!
_---------------
డా.చీదెళ్ళ సీతాలక్ష్మి.

కామెంట్‌లు