జయము జయము జగన్మాత
కోటి వీరుల కన్న మా భరతమాత॥ జయము॥
వెన్నెల వెలుగును ఇచ్చిన మా భరత మాత
విభిన్న భాషల దేశం మా భరతమాత
అనేక సాంప్రదాయాల పుట్టిల్లు మా భరతమాత
॥జయము॥
తన బిడ్డలని గొప్ప పౌరులను చేసింది మా మాత
గొప్ప గొప్ప సంప్రదాయాలు నేర్పింది మా మాత
వీరత్వానికి మారుపేరుగా మార్చింది మా మాత
॥ జయము॥
తీయని మాటల పాటల మా భరతమాత
సిరిజల్లుల వర్షమే మా భరతమాత
మహాలక్ష్మి స్వరూపమే మా భరతమాత ॥ జయము।
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి