ఉగాది:- CH.వెన్నెల-10వ,తరగతి.-జి.ప.ఉ.పా.రామంచ.-మం.చిన్న కోడూరు.-జి.సిద్దిపేట.

ఆటవెలది పద్యాలు
1.
తెలుగు వత్స రాది తెలగాణ పండగ
జనుల కెప్పు డైన జయము గల్గు
పంట పొలము లన్ని పచ్చగా నుండియు
పుడమి శోభ తోడ పుల్క రించు
2.
ఆరు రుచుల తోడ ఆనంద మిచ్చును
పచ్చ చెట్టు పైన పక్షు లన్ని
కూహు కూహు యంటు కోయిల కూయగా
పరవశముగ నుండు వనము యంత
3.ఆ.వె
వేప చెట్టు పూత కాపాడుమనిషిని 
చింత చెట్టు చిగురు చెంత నున్న
అవని జనుల కెపుడు నారోగ్య మిచ్చును
వృక్ష జాతి పెంచి వృద్ధి జేయు

కామెంట్‌లు