. ఉగాది పండుగ :- P.అనూష-7 వ తరగతి -జి.ప.ఉ.పా తొగుట -తొగుట మండలం -సిద్దిపేట జిల్లా
ఉగాది పండగ వచ్చింది 
సంతోషాలు తెచ్చింది 
ఉదయాన్నే లేచి తల స్నానం చేస్తారు 
కొత్త బట్టలు ధరించి దేవునికి దండం పెడతారు,

మామిడి ఆకులు తెచ్చి తోరణాలు కట్టి గుమ్మానికి అలంకరిస్తారు,

వేప కొమ్మలు వేప పూలు తెచ్చి కొత్త కుండను తెస్తారు పసుపు కుంకుమ లతో అలంకరిస్తారు,

తీపి, పులుపు, వగరు ,చేదు, ఉప్పు ,కారం కలిపి ఆరు రుచులతో పచ్చడి చేసి అందరూ కలిసి తాగెదరు
ఆనందంగా గడిపెదరు,

పంచభక్ష పరమాన్నాలతో భోజనం చేసి సాయంత్రం వేళ గుడికి వెళ్తారు. దేవునికి దండం పెడతారు పంచాంగ శ్రవణం చేస్తారు,

పంటలు వర్షాలు బాగుండాలని దేవునికి  దండం పెట్టి వస్తారు. 


కామెంట్‌లు