పుస్తక ప్రపంచం 19సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ
 నెథానియల్ హాథార్న్ రాసిన " దిస్కార్లెట్ లెటర్"1850 లో విడుదలైంది.హెస్టర్ ప్రైన్ అనే ఆమె జీవిత చిత్రణ.ఓశిశువుకి జన్మ నిచ్చాక ఆమె పాట్లు, స్త్రీల అగచాట్లు తెలియజెప్పిన ఆంగ్ల నవల అమెరికన్ సాహిత్యంలో అజరామరంగా నిలిచింది.

అంకుల్ టామ్స్ కాబిన్ 1852
లో వచ్చిన నవల.హారియెట్ బీచర్ స్టే రాసిన నవల లో ఇద్దరు బానిసల బ్రతుకుల వ్యథ.టామ్  మతవిశ్వాసంగల వ్యక్తి .అతనికితల్లి, భార్య, ముగ్గురు పిల్లలున్నారు.ఇంకో బానిస నాలుగేళ్ల  హారీ!యజమాని అప్పు తీర్చటంకోసం అమ్ముడుపోయిన బానిసలు వారిద్దరూ! టామ్ అతని తల్లి ఎలిజా బానిసత్వం నుంచి తప్పించుకున్నారు.కెనడా చేరారు.కానీ టామ్ చనిపోతాడు స్వేచ్ఛతో!ఆనాటి అమెరికన్ బానిసత్వపు బ్రతుకుల గతుకులు, చితుకుల జీవితాలకు దర్పణం ఈనవల! అంతే సివిల్ వార్ కి దారితీసి అమెరికన్ చరిత్ర లో శాశ్వతంగా నిలిచింది.🌹
కామెంట్‌లు