పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లిలోని ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సమ్మర్ స్కూల్ ప్రారంభించనున్నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య తెలిపారు. సోమవారం ఆయన పాఠశాలలో సమ్మర్ స్కూల్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వాదేషానుసారం గ్రామంలోని 1నుంచి 7వ తరగతి చదివే పిల్లల సౌకర్యార్థం ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో వచ్చే నెల 1న సమ్మర్ స్కూల్ ప్రారంభిస్తామన్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో పాఠశాల పిల్లలు ఒకటిన్నర నెలల పాటు చదువుకు దూరమవుతున్నారని, దాంతో ఇదివరకు నేర్చుకున్న అంశాలను పిల్లలు మరచిపోయే అవకాశముందన్నారు. పిల్లలు నేర్చుకున్న అంశాలకు గ్యాప్ (విరామం) లేకుండా వారి చదువు కొనసాగించేందుకు సమ్మర్ స్కూల్ చాలా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ స్కూల్లో చదువుతో పాటు క్రాఫ్ట్, డిజైన్ వివిధ రకాల కృత్యాలు, ఆటపాటలతో ఆనందకరమైన వాతావరణంలో మానసిక వికాసానికి దోహదపడే అనేక అంశాలను బోధిస్తారన్నారు. గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ పాఠశాలలు నడుస్తాయని, మండల విద్యాధికారి, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణ చేస్తారన్నారు. గ్రామంలోని విద్యావంతులను సమ్మర్ స్కూల్ వాలంటీర్ గా నియామకం చేస్తారన్నారు. ఊషన్నపల్లి గ్రామంలోని పిల్లలందరూ ఎవరూ కూడా ఊర్లకు వెళ్లకుండా, ఎండలో తిరగకుండా సమ్మర్ స్కూల్లో జాయిన్ అయి, విజ్ఞానంతో పాటు వివిధ అంశాల్లో విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, ఇది పూర్తి ఉచితమని ఈర్ల సమ్మయ్య తెలిపారు. ఊషన్నపల్లి గ్రామంలోని తల్లిదండ్రులు వారి పిల్లలందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఊషన్నపల్లిలో మే 1నుంచి సమ్మర్ స్కూల్ :- ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి