ఋషయ ఊచుః ।
గుహ్యాద్గుహ్యతరా విద్యా గురుగీతా విశేషతః ।
బ్రూహి నః సూత కృపయా శృణుమస్త్వత్ప్రసాదతః ॥ 1 ॥
సూత ఉవాచ ।
గిరీంద్రశిఖరే రమ్యే నానారత్నోపశోభితే ।
నానావృక్షలతాకీర్ణే నానాపక్షిరవైర్యుతే ॥ 2 ॥
జనార్ధన్ గల్వంకర్ అనే సాయి భక్తుడు 1921 వ సంవత్సరం లో ప్రయాగ వెళ్ళి అక్కడ మహర్షి భరద్వాజ ఆశ్రమం లో కూర్చోని శ్రీ సాయి సచ్చరిత్ర సకుటుంబంగా పారాయణ చేసాడు.అనంతరం అక్కడ ఎవరైన మహనీయుల దర్శనం తనకు ప్రసాదించమని బాబాను ప్రార్ధించాడు. అప్పుడు ఒక గైడ్ గల్వంకర్ ను కలిసి ఒక మహా పురుషుడు ఏడు సంవత్సరాల కొకసారి ప్రయాగ వస్తుంటాడని అయితే ఆయన ఎవ్వరికీ దర్శనం ఇవ్వరని, ఆఖరుకు ఎవ్వరితో కూడా మాట్లాడదరని చెప్పాడు. సాయిని స్మరించుకుంటూ గల్వంకర్ ఆ మహనీయుని దరికి వెళ్ళగా అందరినీ కసిరి కొట్టే ఆ మహనీయుడు గల్వంకర్ ను చూడగానే ఎంతో ప్రేమతో “ రా నాయనా “ అంటూ ఆహ్వానించి , గల్వంకర్ ఇచ్చిన దక్షిణను స్వీకరించి, అతని కుటుంబమంతటినీ ఆశీర్వదించారు.
తన భక్తుల మదిలో మెదిలే సత్సంకల్పాలను తప్పగ నెరవేరుస్తానని శ్రీ సాయినాధులు ఈ లీలల ద్వారా మరొక్కసారి తెలియజేసారు.
విదేశాల నుండి శ్రీ రమణ మహర్షి భక్తులైన ఒక కుటుంబం మద్రాస్ వచ్చింది. ఆక్కడ విమానాశ్రయం లో కొందరు సాయి భక్తులు తము నిర్మిస్తున్న సాయి మందిరానికి వారిని విరాళం అడగగా మేము రమణ మహర్షి భక్తులం కావున మీకి విరాళం ఇవ్వలేము అని నిక్కచ్చిగా చెప్పేసారు. తర్వాత రమణ మహర్షి భక్త బృందం అరుణాచలం వెళ్ళగా అక్కడ రమణ మహర్షి చిత్రపటం లో వారికి శ్రీ సాయినాధుని దర్శనం అయింది. మహనీయులందరూ ఒక్కటే,అందరిలో వుండేది ఒకటే ఆత్మ తత్వం , రమణ మహర్షి అయినా, సాయి అయినా, వివేకానందులు అయినా వారి మూల సిద్ధాంతాలు ఒక్కటే, నిర్గుణుడూ, నిరాకారుడూ అయిన భగవంతుడు వివిధ కాలాలలో వివిధ రూపాలు ధరించి శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన గావిస్తాడని, వారి వరి మధ్య బేధాలను చూడడం అవివేకం అని అర్ధమై ఆనాటి నుండి జ్ఞానవంతులై అధ్యాత్మిక మార్గం లో చరించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి