ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పదవతరగతి 2004 బ్యాచ్

 వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలో ZPHS బాలుర ఉన్నత పాఠశాలల్లో ఆదివారం పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఈ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 2004-05 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు బాలుర పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఈ సందర్బంగా గడిచిన గతాన్ని చిన్ననాటి మధుర జ్ఞాపకాల్ని నెమరేసుకుంటూ ఆనందంగా పూర్వ విద్యార్థులు విద్యాబుద్దులు నేర్పిన గురువులను ఆత్మీయంగా సన్మానించుకున్నారు..
      స్నేహపూర్వకమైన సంబంధాలను పంచుకుంటు, పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ,ఇక్కడ విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు వివిధ స్థాయిలో ఉన్నవారు అందరూ హాజరయ్యారు. పూర్వ విద్యార్థులు నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ సార్ , సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరేపల్లి తెలుగు రాఘవేంద్ర, ఆత్మకూర్ రాజు, మల్లేష్, నాగార్జున, రాజయ్య రాఘవేంద్ర సాగర్, సీంగంపేట మహేష్, ఆర్ మహేష్, రామకృష్ణ , భాస్కర్ లు పాల్గోన్నారు.
       ఈ సందర్భంగా పలువురు మాట్లా డుతూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం పూర్వ విద్యార్థులు కలుసుకొని తమకు విద్యను బోధించిన ఉపాధ్యాయులకు సన్మానించడంతోపాటు పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. 2004హ05 తమ పూర్వపు విద్యార్థులను కలుసుకునే విధంగా కృషి చేసిన వారి మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
కామెంట్‌లు