పుస్తక ప్రపంచం22 సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ
 కార్లు మార్క్స్ రాసిన దాస్ క్యాపిటల్ ప్రపంచంలోనే కార్మిక వర్గానికి శ్రేయస్సు కూర్చుంది 1867లో ఇది పబ్లిష్ అయింది క్యాపిటల్ ఇజం ని ఇది విరోధించింది కార్లు మార్క్స్ ఒక విప్లవాత్మక మార్పులు తెచ్చాడు సమాజంలో నేటి కమ్యూనిజం కి బాట వేశాడు. ప్రపంచంలోని కమ్యూనిస్టులు అందరికీ ఇది వెలుగు దివ్వె.
19 శతాబ్దిలోనే ఫ్రెంచ్ రచయిత గొప్ప గ్రంథాలు రాశాడు.అందులో ఆయన ప్రస్తావించిన విషయాలు నేడు శాస్త్రీయముగా నిజం కావడం వింత ఆశ్చర్యం!"Twenty thousand Leagues under the Sea" లో కెప్టెన్ నెమో  అతని సిబ్బంది సాహసయాత్రల వర్ణన అద్భుతం!ఒక ఆటమిక్ సబ్ మెరైన్ లో పయనం ఆనాడు ఊహ,కానీ నేడు నిజం కావడం ఆశ్చర్యం! సముద్రంలోపలి పరిస్థితులను పర్యావరణ కాలుష్యం వేల్స్ ప్రాణులకు పొంచి వున్న ప్రమాదాన్ని ఆయన ఊహించి రాయడం మహాద్భుతం.సౌత్ పోల్ ,అట్లాంటిస్ సిటీ ని గూర్చిన వర్ణన ఆతర్వాత పరిశోధకులకు నావికులకు మార్గనిర్దేశం చేసింది.
ఆంగ్ల సాహిత్యంలో అతిపొడవైన వాక్యం"యులెసిస్" లో ఉంది.జేమ్స్ జాయిస్ 4,391పదాలున్న ఒకవాక్యం రాయడం రికార్డు నెలకొల్పింది. మన దేవుని దండకాలు కూడా చాలా పెద్దగా ఉంటాయి ఒకే వాక్యంగా🌹

కామెంట్‌లు