లియో టాల్ స్టాయ్ "వార్ అండ్ పీస్" నవల రాయటానికి 7ఏళ్లు పట్టింది.1886లో పబ్లిష్ ఐంది.రష్యా పై నెపోలియన్ దండయాత్ర దీని కథ.రైతులు భూస్వాములు,సామాన్య జనులు సైనికుల బాధలు సమస్యలు ఆనాటి పరిస్థితులను చక్కగా చిత్రించాడు .వార్ అండ్ పీస్ లో460000 రష్యన్ ఫ్రెంచ్ పదాలున్నాయి.ఆరోజుల్లో కంప్యూటర్లు, కాపీయింగ్ మిషన్స్ లేవు.టాల్ స్టాయ్ భార్య తన చేత్తో మొత్తం నవలని 7సార్లు కాపీ చేసిందిట!మరి ఆయన భావాలు కొత్త ఊహలకి తగినట్లు చిత్తుప్రతిలో మార్చాలికదా!?
నిజంగా ఆమె ఓపికకు జోహార్లు.అసలు సిసలు పతివ్రతా శిరోమణి కదండీ!బ్రామ్ స్టోకర్ రాసిన " డ్రాకులా" తో వాంపైర్ కథలకి డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు.భయంకర మొండి వాంపైర్ తన శవపేటికనుంచి లేచి రాత్రిపూట ప్రాణులరక్తం పీలుస్తుంది.విక్టోరియన్ కాలపు మనుషుల ప్రవర్తన వారి జీవన విధానం చిత్రింపబడిన నవల.హారర్ కథలకు బీజం వేసింది🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి