దిడైరీఆఫ్ అన్నెఫ్రాంక్ రాసిన చిన్నారి 13 ఏళ్ల జ్యూ జాతికి చెందిన అన్నెఫ్రాంక్. 1942లో భయంకర పరిస్థితుల్లో నాజీల దురాగతాల్ని హృదయ విదారకంగా ఉన్నది ఉన్నట్లు ఎలాంటి అతిశయోక్తులు పటాటోపంలేకుండా రాసిన ఆచిన్నారి నిజమైన రచయిత్రి.1942లో నాజీలు హాలెండ్ ని ఆక్రమించారు 13ఏళ్ల అన్నెఫ్రాంక్ ఆమె కుటుంబం ఆంస్టర్ డామ్ ని విడిచి రహస్య ప్రదేశంలో బిక్కు బిక్కు మంటూ నివసించారు. అలా 2ఏళ్లు ఆనరకంలోనే ఆచిన్నారి రాసిన డైరీలో విషయాలు చరిత్ర కి ప్రత్యక్షసాక్షి.రచనలు యధార్ధానికి దర్పణం గా ఉండాలి.కానీ నేడు వివిధ పేపర్లలో వచ్చే సమాచారం చదివితే భావితరానికి నిజం తెలీదు.అయోమయం కి గురి కావటం తథ్యం.అలన్ పాటన్ రాసిన "క్రై, ది బిలౌవ్డ్ కంట్రీ"దక్షిణ ఆఫ్రికా చరిత్ర కి ప్రత్యక్షసాక్షి.తెల్లజాతివారి దురహంకారం దురాగతాల్ని ,వారిచేతల్లో నలిగిన బ్లాక్స్ కష్టాలు ఆకలి ఆర్తనాదాలు బీదరికంని కళ్లకు కట్టినట్లు చూపిన నవల!1948 లో పబ్లిష్ అయిన ఈపుస్తకం ప్రపంచం కళ్లు తెరిపించింది. హల్ చల్ చేసిన నవల🌹
పుస్తక ప్రపంచం 34 సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి