శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం -4- సి.హెచ్.ప్రతాప్
 అచింత్యావ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే
సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః            1
ఋషయ ఉవాచ:
సూత సూత మహా ప్రాఙ్ఞ నిగ మాగమ పారగం
గురు స్వరూప మస్మాకం బ్రూహి సర్వ మలాపహం
సాయి భక్తాగ్రేసరుడైన రేగే తన మిత్రుడు అవస్తేతో కలిసి 1914 వ సంవత్సరం లో శిరిడీకి బయలుదేరాడు.అవి ప్రపంచ యుద్ధం జరిగే రొజులు.దేశం లో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సైనికులను వెనువెంటనే తరలిస్తున్న రోజులు.అహమద్ నగర్ స్టేషనులో ఆ రైలు బండి నుండి ప్రయాణీకులందరినీ దించి సైనికులను ఎక్కిస్తున్నారు. ఆది చూడగానే రేగే గుండె ఝల్లుమంది. ఈ రైలు మిస్ అయితే మరి పన్నెండు గంటలవరకు మరొక బండి లేదు. అర్ధరాత్రి ఈ చలిలో ఇక్కడా కూర్చోవడమెలా అని భయపడుతునే నీ సన్నిధికి వస్తున్న మా పట్ల దయ చూపమని సాయిని వారు అతి దీనంగా ప్రార్ధించారు.అంతలోనే ఒక అద్భుతం జరిగింది. ఆ సైన్యాధికారి వీరిద్దరినీ చూడగానే విష్ చేసి తిరిగి రైలెక్కించాడు. పట్టరాని ఆనందంతో ఇద్దరూ సాయి భజన చేసారు.
బాబా దయ వలను సుఖంగా ప్రయణం చేసి మర్నాడు శిరిడీ చేరి బాబాను దర్శించుకోగా  ఆయన చిరునవ్వుతో” అరె భద్రంగానే వచ్చారే ! మిమ్మల్ని తిరిగి రైలెక్కించమని ఆ సైన్యాధికారితో నేనే చెప్పాను.రాత్రంతా మీరు నిద్ర పోలేదు, నన్ను నిద్ర పోనివ్వలేదు” అని అన్నారు. బాబా తమ పట్ల చూపిన అసమాన్యమైన ప్రేమాభిమానాలను గుర్తించి ఇద్దరికీ ఆనంద బాష్పాలు వచ్చాయి. కన్నీటితో ఆయన పాదాలను అభిషేకించి అనుపమానమైన ఆయన ఆశీర్వాదాన్ని పొంది సంతృప్తిగా తిరిగి వారి స్వస్థలానికి ప్రయాణ మయ్యారు.

కామెంట్‌లు