బాల సాహిత్యం నేడు బాగా ప్రచారంలోకి వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పిల్లల పుస్తకాలే 400 పైగా ముద్రించబడ్డాయని మా తెలుగు సార్ చెప్పగా విన్నాను.సాహిత్యం కవులు పిల్లల కోసం రాయడం గొప్ప విషయమే.పిల్లల చేత బాలసాహిత్యం రాయించడం విశేషం. బాలసాహిత్యంలో వివిధ ప్రక్రియలు ఉన్నప్పటికీ కథలు చాలా ఆసక్తి చూపుతాయి.చిన్నపిల్లలకు కథలు అంటే చాలా ఇష్టం.చిన్నప్పటినుంచి నాయనమ్మ,తాతయ్య,అమ్మమ్మ,అమ్మ నాన్నల ద్వారా ఎన్నో నీతిని తెలిపే కథలను నేర్చుకున్నాము.అందులో ఉన్నటువంటి నీతిని తెలుసుకున్నాము.కథలు పిల్లలకు క్రమశిక్షణ,మంచి నడవడినేర్పుతాయి.పక్షులు, జంతువులు, చెట్లు,వాటి అవసరాన్ని కథలో ఉపయోగ తెలుసుకోగలుగుతారు.చిన్నపిల్లలకు హాస్య కథలు, వీరుల కథలు,నీతి కథలు చెప్పాలి.రాక్షసుల కథలు, భయపడే కథలు చెప్పకూడదు.కథలో ముగింపు పిల్లల చేత చెప్పించాలి.అప్పుడు వాళ్లకు ఆలోచన శక్తి పెరుగుతుంది.కథలు కల్పితాలే కావచ్చు కానీ నిజానికి దగ్గరగా ఉంటాయి.అందుకే పిల్లలకు చెట్లు,పక్షులు,జంతువుల చిత్రాల ద్వారా మాట్లాడించాలి.వాటిద్వారా కథలు రాయించాలి.మా పాఠశాల తెలుగు సార్ వరుకోలు లక్ష్మయ్య గారు రోజు పాఠంతో పాటు అనేక నీతి కథలు చెప్తారు.కథలను మేము ఇష్టంగా వింటాం. అందులోని నీతిని తెలుసుకుంటాం.
మా గ్రంధాలయంలో చాలా కథల పుస్తకాలు ఉన్నాయి.వాటిని మాకు రోజు ఇచ్చి చదివిస్తాడు. అందులో నీతి చెప్పిస్తాడు.కథలో ఉన్న మెలకువలు నేర్పిస్తారు.మాకు ఏదైనా చిత్రం చూపించి కథలు రాయిస్తారు.తప్పులను సవరిస్తారు.ఈ విధంగా చెప్పడం వల్లనే మాకు కథలు రాసే ఆసక్తి పెరిగింది.మా చేత అనేక కథలు రాయించారు. వాటిని సవరించారు.ఆ కథల తోటే *బక్రిచెప్యాల బాదుషాలు* అనే బడి పిల్లల కథలను ముద్రించారు. ఇందులో 40 కథలు ఉన్నాయి.కథలన్నీ నేటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయి.దీని కవరి పేజీ జంతువుల బొమ్మల చేత చూడడానికి ఆకర్షణీయంగా ఉంది.ఇందులో ముందుమాటలు గొప్ప గొప్ప వాళ్ళు రాశారు. డాక్టర్.నామోజు బాలా చారి తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి,డాక్టర్ జె.చెన్నయ్య తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి గారు,
డాక్టర్. పత్తిపాక మోహన్ కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత,
ఇ.శ్రీనివాసరెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారిగారు సిద్దిపేట జిల్లా, డి.నాగేందర్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారలు విలువైన సమాచారాన్ని అందించారు.అందరికీ నా నమస్కారాలు.
మా పాఠశాల ఉపాధ్యాయులందరూ సహకరించడం వలననే పుస్తకం ప్రింట్ అయింది.
మా కథలను అందులో చూసుకోగలుగుతున్నాం.
నేటి యువకులు సిగరెట్లు, బీడీలు తాగి ఆరోగ్యాన్ని పాడుచేసుకుని క్యాన్సర్ బారిన పడుతున్నారని జక్కుల లోహిత *ధూమపానం* కథలో చెప్తుంది.ఈ కథకు మాచిరాజు బాల సాహిత్యం కథల పోటీలు 2025.తెలంగాణ రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి గెలుచుకోవడం జరిగింది.
నేను రాసిన *ఐకమత్యం* కథలో చీమలన్ని క్రమశిక్షణ పాటించి బాటకు అడ్డంగా ఉన్న పెద్ద బండరాయిని తొలగిస్తాయి.పాము చీమల పుట్టలో చేరిచీమలను తినుకుంటూ సోమరిగాతయారవుతుంది.
అన్ని కలిసి దాన్ని కుట్టడం చేత దాని పీడ విరగడైపోతుంది.
భౌగోళ్ళ అక్షిత్ రాసిన *తగిన శాస్తి* కథలో వేటగాడు నెమలినిh బంధిస్తాడు.పోలీసులచేత శిక్ష పడుతుంది.అయినా వేటగాడిలో బుద్ధి మారలేదు. చివరికి జంతువులన్నీ కలిసి అతన్ని మారుస్తాయి తగిన శాస్తి చేస్తాయి.
విద్యార్థులు పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయని బాధపడకూడదు.మళ్లీ,మళ్లీ ప్రయత్నిస్తే ఎక్కువ మార్కులు వస్తాయి.*ప్రయత్నిస్తే విజయం* అనే కథలో సాలీడు తన గూడు ఎన్నిసార్లు చెడిపోయిన పట్టు వదలకుండా కట్టుకుంటుంది. దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని మీర్జా సపూర కథలో తెలియజేసింది.
*వృత్తి ధర్మం* కథలో డాక్టర్ సారంగపాణి తన కొడుకు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
అయినా ధైర్యంగా హాస్పిటల్లో ఉన్న పేషెంట్ ప్రాణాలు కాపాడడమే ముఖ్యమని దుద్దెడ ముఖేష్ కథలో తెలిపారు.
నేను రాసిన మరో కథ *కొంగల బెడద* ఇందులో కొంగలు అడవులు నరికి వేయడం వలన ఊర్లోకి వచ్చాయి.వాటి రెట్ట వాసనను భరించలేక చాలామంది రోగాల పాలయ్యారు.వీటిని తరిమివేయాలని చెట్టు కింద బాంబులు పెట్టారు.దానితో వాడికి ప్రమాదం ఏర్పడింది. అందుకే మనం పర్యావరణంలో భాగంగా అనేక చెట్లను పెట్టాలి అని తీర్మానించుకున్నారు.
*కొబ్బరి చెట్టు* కథ పెంబర్ల చరణ్ రాశారు.
చెట్లలో ఒకటి వంకరగా పెరుగుతుంది ఒకటి నీరందడం వలన మంచిగా పెరుగుతుంది. మంచి చెట్టు,వంకర చెట్టును ఎగతాళి చేస్తుంది.ఇలాంటి ప్రవర్తననే మనుషుల్లో కూడా ఉంటుందని తెలియజేస్తుంది. ఈ కథ అందుకే ఎవరిని చిన్న చూపు చూడకూడదని నీతిని తెలుపుతుంది.
బాదుషాలు కథ జక్కుల శరణ్య రాసింది.కవర్ పేజీ బొమ్మను చూసి ఆలోచించి మంచి కథ రాసింది. అడవి జంతువులు విందు ఏర్పాటు చేసుకుంటాయి తలాఒక పనిచేసి అన్ని వంటలు తయారు చేస్తాయి కానీ తీపి వంటకం లేదని ఆలోచిస్తాయి.అప్పుడు మా తెలుగు సార్ కి ఇష్టమైన బాదుషాలు తయారు చేస్తాయి.గురువుగారికి వడ్డించి అన్ని కూడా కలిసి తింటాయి.
నేను రాసిన మరో కథ *స్నేహం కోసం*ఈ కథలో తెలుగు,హిందీ,ఇంగ్లీష్ మూడు భాషలు నేర్చుకున్నవారు ప్రపంచంలో ఎక్కడైనా బతకగలుగుతారని నిరూపించాను.
*సూర్య రశ్మి* కథలో భౌగోళ్ల శ్రీపూజ పెద్ద చెట్ల కింద చిన్న చెట్టు పెడితే మొలువదు. మొలిచిన అది పెద్దగా ఎదగదని నిరూపిస్తుంది.
సూర్యరశ్మి గొప్ప తనం గూర్చి తెలుపుతుంది.
*తాతకుసాయం* కథలో నరాల ప్రసన్న ఒక అనాథ తాతకు సోనీ దగ్గరై అతనికి అన్నం పెడుతుంది.అతని నుండి ఎన్నో కథలు,మంచి విషయాలు నేర్చుకుంటుంది.వృద్ధులను అనాధ శరణాలయాల్లో వేయకూడదని తెలియజేస్తుంది.
ఈ పుస్తకంలో ఇంకా ఎన్నో ఆణిముత్యాల లాంటి కథలు ఉన్నాయి.ఈ కథలన్నీ కూడా మొలక,బాల చెలిమి,ప్రజాశక్తి, నేటినిజం పత్రికలలో రావడం జరిగింది.
*బక్రిచెప్యాల బాదుషాలు* కథల పుస్తకాన్ని అందరు చదవాలి.మమ్ములను పెద్దమనసు చేసుకుని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.ఈ పుస్తకాన్ని ముద్రింపజేసిన మా పాఠశాల ఉపాధ్యాయులు అందరికీ,మమ్ములను కథలు రాయడానికి సహకరించిన మా తెలుగు సారు వరుకోలు లక్ష్మయ్య సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను.
ఈ పుస్తకానికి ముఖచిత్రం
ఎంతోఆకర్షనీయంగాఉంది.
ప్రతి కథకు ఒక బొమ్మ, రాసిన విద్యార్థి పేరు, ఫోటో ఉండడం గొప్ప విషయం.ఈ పుస్తకం పిల్లల మదిలో ఎప్పటికీ నిలిచిపోతుంది.64 పేజీలు 40 కథలతో కూడి ఉంది ఈ పుస్తక సంకలనం ఇతర పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఆదర్శనీయం.ఈ బాలల కథల సంకలనాన్ని తెలంగాణలోని అన్ని పాఠశాల గ్రంధాలయాలకు చేరేవేసే విధంగా అధికారులు ప్రయత్నించాలి.మాలాంటి బాలలు ఇంకా కొంతమంది కథలు నేర్చుకోవాలని,కథలు రాయాలని,మంచి బాలసాహిత్య గ్రంథాలు తీసుకురావాలని కోరుకుంటూ న్నాను.
ప్రతులకు
జెడ్పిహెచ్ఎస్.బక్రిచెప్యాల
జిల్లా సిద్దిపేట
చరవాణి:9704865816
ధర:80-00 రూపాయలు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి