శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం -7:- సి.హెచ్.ప్రతాప్
 శ్రీ గురు గీత లోని 7 , 8 వ శ్లోకాలు :
సూత ఉవాచ
శృణుధ్వం మునయః సర్వే శ్రద్ధయా పరయా ముదా
వదామి భవ రోగఘ్నీం గీతాం మాతృ స్వరూపిణీం   7
పురా కైలాస శిఖరే సిద్ధ గంధర్వ సేవితే
తత్ర కల్ప లతా పుష్ప మందిరేత్యంత సుందరే    8
సాయి భక్తాగ్రేసరుడైన దాసగణు మహారాజ్ తన కీర్తనలు, హరి కధ సత్క్కాలక్షేపం, ఉపన్యాసాల ద్వారా సాయి నాధుని మహిమలను , అవతార ప్రశస్థిని దేశం నలుమూలలా ప్రచారం చేసాడు. తద్వారా సాయినాధుని దర్శనం కోసం నిత్యం వేలాది మంది శిరిడీకి వస్తుండేవారు. ఒక సారి దాసగణు తన కీర్తనల పరంపరను ముగించుకొని శిరిడీకి వచ్చేందుకు కొపర్గం లో రైలు దిగాడు. మాటల సంధర్భం లో అతనికి, కోపర్గాం స్టేషన్ మాస్టరుకు మధ్య వాగ్వివాదం చెలరేగింది. సాయిని గూర్చి ఆక్షేపింపదగిన మాటలను ఆ స్టేషన్ మాస్టర్ అన్నపుడు ఒకసారి శిరిడీ వచ్చి సాయి ప్రభువులను దర్శించుకున్నాక మట్లాడమని దాసగణు సమధానం చెప్పాడు. సరే అని అతనితో బయలుదేరి స్టేషన్ మాస్టర్ శిరిడీకి వచ్చాడు. మసీదు ముందు వరుసగా  మట్టి కుండలను బోర్లిస్తున్నారు శ్రీ సాయినాధులు. వారికి నమస్కరించి  ఎందుకలా కుండలను బోర్లిస్తున్నారని దాసగణు అడుగగా “ ఏం చెయ్యమంటావు గణు ? నా వద్దకు వచ్చేవారి హృదయాలన్నీ బోర్లించే కుండల వంటివి. ఎంతగా నీరు నింపుదామన్నా సాధ్యపడడం లేదు” అని చమత్కారం గా అన్నారు. కొంచెం అర్ధమయ్యేలా వివరించండి బాబా “ అని దాసగణు ప్రార్ధించగా “ మానవుల హృదయాలు ఖాళీ కుండల వంటివి. విశ్వాసంతో వస్తే కుండలలో నీరు నింపినట్లు వారి హృదయాలలో జ్ఞానాన్ని నింపవచ్చు. కానీ అవిశ్వాసంతో వచ్చేవారి హృదయాలు బోర్లించిన కుండల వంటివి. వాటిపై ఎంత నీరు పోసిన పక్కకు జరిపోతాయి గాని నిండవు” అని బాబా బదులిచ్చారు. ఆ మాటలకు ఆ స్టేషన్ మాస్టర్ సిగ్గుతో తల వంచుకున్నాడు. అక్కడ వున్న మూడు రోజులలో ఒక కొత్త ప్రపంచాన్నే చూసాడు. సంతానం లేని వరు సంతానాన్ని, నిరుద్యోగులు ఉద్యోగాలను పొందుతున్నారు.రొగలతో బాధ పడేవారు మందూ మాకు లేకుండానే ఆరోగ్యవంతులై తిరిగి వెళ్తున్నారు. ఏడుస్తూ వచ్చిన వారు తమ బాధలకు పరిష్కారం పొంది నవ్వుతూ హయిగా వెళ్తున్నారు.కుల మత వర్గ, ప్రాంతీయ బేధాలు లేకనే అందరికీ సమానంగా సాయి అనుగ్రహ ఫలం దక్కుతోంది. మా వల్లకాదని వైద్యులు చేతులెత్తేసిన వారందరికీ సాయి అభయ హస్తం అందించిన తోడనే రోగాలు మటుమాయం. దుఖం, ఆశాంతి, ఆందొళన అన్నవి శిరిడీలో మచ్చుకైనా కనిపించడం లేదు. అంతటా స్వచ్చమైన అధ్యాత్మిక ప్రశాంతత నెలకొనబడి వుంది.  
సాయిని వట్టి మోసగాడినని వాదించిన ఆ స్టేషన్ మాస్టరుకు ఇదంతా చెసేసరికి అజ్ఞానపు చీకట్లు తొలగిపోయి జ్ఞానోదయమయ్యింది. శ్రీ సాయి కేవలం యోగ సామ్రాట్టే కాక పరిశుద్ధ పరమెశ్వర అవతారం అని గ్రహించాడు. తీవ్రమైన పశ్చాత్తాపంతో వెళ్ళి సాయినాధుని కాళ్ళపై పడి తన తప్పులకు క్షమార్పణ వేడుకున్నడు. కరుణా సముద్రుడైన శ్రీ సాయి దేవుడు అతనిని శ్రీఘ్రమే క్షమించి ఉదీ ప్రసాదాలతో ఆశీర్వదించి పంపించేసారు

కామెంట్‌లు