(ధరిత్రి దినోత్సవ సందర్భంగా)======================నా పంచపదుల సంఖ్య---1676-1679.1676.అమ్మ కట్టుకున్న పచ్చని ,పట్టు చీర నిండా ఛిద్రాలే!అమ్మ పెట్టుకోవడానికి ,నగల మూటలు వ్యర్ధాలే!భూగ్రహం జీవన సౌలభ్యం బావిలో పలు సందేహాలే!భూమి కాపాడకుంటే ,మానవ జీవనం పరిహాసాలే!జనని, జన్మనిచ్చిన భూమి, మనుగడ ఆధారాలే,పివిఎల్!1677.ధరిత్రి దినోత్సవ ధ్యేయం ,,పర్యావరణ రక్షణము!గెలార్డ్ నెల్సన్ ఆలోచనల, ఆచరణ రూపము!/అమెరికాలో మొదట ,తదుపరి విశ్వాన వ్యాప్తము!"ఎర్త్ డే నెట్ వర్క్"ఉద్యమాన,మార్గదర్శకత్వము!కాలుష్య కోరల నుండి మనం, భూమిని కాపాడదాము, పివిఎల్!1678.మన అమ్మలంతా క్షేమం, వాళ్ళమ్మ కడుదయనీయము!మనం అమ్మమ్మ ధ్యాసే లేని, ఆధునిక మానవులము!నాగరికత వికాసము,పర్యావరణ విధ్వంసము!అడవులు నరకడము, భూగర్భజల హరణము!నేల, నీరు, నింగి, గాలి, కాలుష్యాల స్థిర నివాసము, పివిఎల్!1679.ది ఫీస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్,దినోత్సవ ఆశయము!ఇంట బయట పరిరక్షణ, శపధం నిర్వహిద్దాము!గ్రీన్ హౌస్ వాయువుల, పెరుగుదల నియంత్రిద్దాము!తరిగిపోని ఇంధన వనరులు, వినియోగిద్దాము!ధరిత్రిపరిరక్షణమహోద్యమాన,సాగిపోదాము, పివిఎల్!________
మన ధర భద్రతే! జన ప్రథమ బాధ్యత!:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి