నృత్య దినోత్సవంశుభాకాంక్షలు.----------------------------------బతుకు ఎడతెరిపిగా,సాగే నృత్యం!ఒక్కసారే ఆగుతుందిగా ,అదే సత్యం!భావ, రాగ ,తాళ,సంగమం భరతనాట్యం!భరతముని విరచితం,,జగత్ ప్రసిద్ధం!ఆది దంపతుల నర్తనం ,జగానికే ఆనంద కారణం!నంది నర్తనం గజాసుర ,సంహార సాధనం!జగన్మోహిని మోహభరిత, అడుగులే భస్మాసుర అంతం!మన సంస్కృతి, సాంప్రదాయాల మనుగడ,శాస్త్రీయ నృత్యం!మానసిక అలసట ,మరిపించే నృత్య వీక్షణం!నేటి కాలానికి ప్రతి,ఒక్కరికి ఆనంద పోషణం!కలలాంటి జీవితానికి,కళ తెస్తుంది కళ!కళ చూసే,చూపే, కళ్ళే కళ్ళు,ఆనందాల లోగిళ్ళు!_________
నృత్యం.: - డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి