\ రాజయ్య ఒక మామూలు పశువుల కాపరి. అతడు ఆమణి అనే రామ చిలుకను పెంచుకుంటున్నాడు. దానికి మంచి మంచి మాటలు అన్ని నేర్పాడు .ఒక రోజున పశువులను మేపడానికి రాజయ్య గుట్టల ప్రాంతానికి వెళ్ళాడు. పశువులు మేపుతున్న రాజయ్యకు అనుకోకుండా జ్వరం వచ్చింది. ఇబ్బందితో చెట్టు కింద నిద్రపోయాడు. సాయంత్రం వరకు మెలకువ రాలేదు. పశువులు ఇంటి బాట పట్టి వెళ్ళిపోయాయి. ఇంటికి చేరుకున్న పశువులను చూసి రామచిలుక తన మాటలతో పక్కనే ఉన్న వ్యక్తిని పిలిచింది. అతడు పశువులను కొట్టంలో తోలి తడక వేశాడు.
చాలాసేపు అయినప్పటికీ తన యజమాని రాజయ్య కనిపించలేదు. చిలుక ఆందోళన పడ్డది. ఆత్రుతగా రాజయ్య ఉన్న చోటికి వెళ్ళింది. చెట్టు కింద పడుకున్నా రాజయ్యను చూసి లెమ్మని పిలిచింది. జ్వరంతో బాధపడుతున్న అతడిని చూసి చలించిపోయింది. రాజయ్య ఎంతకూ లేవకపోవడంతో రామచిలుక ఊరును చేరి జరిగిన విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పింది. అయ్యో ..!అంటూ వాళ్లంతా వైద్యుడితో రాజయ్య ఉన్న చోటుకు వెళ్లారు. మూలుగుతూ ఉన్న రాజ్యయ్యను చూసి వైద్యుడు మాత్రలు వేసి, ఇంజక్షన్ ఇచ్చాడు. కొద్దిసేపు సమయం గడిచాక చేరుకున్నాడు. అందరూ కలిసి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. రామచిలుక చేసిన సహాయాన్ని అందరూ మెచ్చుకున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి