మంచి నేస్తాలు:- యం. రాం ప్రదీప్ -జెవివి సభ్యులు, తిరువూరు-9492712836
 రాజు! ఏంటలా పుస్తకాలని చిందర వందరగా పార వేస్తున్నావు.
పరీక్షలు అయిపోయాయిగా మామయ్య. .ఇంకా వాటితో పనేముంది?
అదేంటి రాజు! పాఠ్య పుస్తకాలలో చాలా విలువైన సమాచారం ఉంటుంది. భవిష్యత్తులో  ఇవి నీకు చాలా ఉపయోగపడతాయి.
అదెలా మామయ్య! వచ్చే సంవత్సరం నుండి సిలబస్ కూడా మారుతుంది కదా! ఇంకా ఈ పుస్తకాలు, నోట్ బుక్స్ తో పనేముంది. అయినా మా ఫ్రెండ్స్ చాలా మంది పుస్తకాలని ఇలానే పారవేస్తున్నారు. మరి కొంతమంది నోటు బుక్స్ ను కిరాణా షాప్ లో అమ్ముతున్నారు.
ఆలా చేయకూడదు రాజు. సిలబస్ మారినా ప్రాథమిక అంశాలు ఎప్పుడూ మారవు. కొత్త పుస్తకాలు వచ్చే దాకా సెలవుల్లో  సరదాగా కథల పుస్తకాలతో పాటు ఈ పుస్తకాలని కూడా చదువు కోవచ్చు. భవిష్యత్ లో నీవు ఏ పరీక్ష రాసినా, చాలా ప్రశ్నలు క్రింది తరగతుల పాఠ్య పుస్తకాల నుంచే వస్తాయి. కాబట్టి పాఠ్య పుస్తకాలని పార వేయవద్దు.పైగా పుస్తకాలు మనకు మంచి నేస్తాలు కూడా.
ఓ అలాగా మామయ్య!అయితే నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఈ విషయం మా ఫ్రెండ్స్ కూడా చెప్తా.
శభాష్  అంటూ రాజును అభినందించాడు మామయ్య సూర్య.




కామెంట్‌లు