మారణాయుధాలకు
మానవత్వమెక్కడిది
ఉండవలసింది
ఆయుధం ఉపయోగించే వాడికే గదా
ఉన్మాదమే పాఠంగా వల్లెవేయువాడు
మందుపాతరలాంటోడు
ఎప్పుడూ ఎక్కడా పేలుస్తాడో
అది
ఊహకందనిది
ఇక్కడ ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టలేడనట్టు
శత్రువు మనలో ఒకడిని ఏమార్చొచ్చు
ఇప్పుడు
అందరూ నష్టం జరిగాక
నఖశిఖపర్యంతం
దర్యాప్తుజరిపేవారే
ముందే మేల్కొంటే
ఈ దుర్ఘటనకు ఆస్కారముండేదా!అని
తప్పు ఎవరినీ పట్టలేము
శత్రువు తన వ్యూహాన్ని ఎప్పుడూ ఎలా మారుస్తాడో
ఒక్కోసారి ఎంతగా ఆలోచించిన
మన ఊహకందనిదవుతుంది
అప్రమత్తంగా ఉందాం
అరాచక శక్తుల ఆటకట్టిద్దాం
మనదేశానికిశాంతి, సహనం రెండు కళ్ళని చాటుదాం
ఆనక ఎదురుతిరిగితే
మన సత్తాచూపుదాం
ముష్కరులను తుదముట్టిద్దాం
శాంతి సహనం మన రెండు కళ్ళు : - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి