ఇది ఒక మీటర్ వరకు ఎత్తు కలిగి ఉండే మొక్క ఆంధ్ర ప్రదేశ్ లోని చవుడు నేలల్లో పాటి మట్టి పేరళ్లలో తరచుగా కనిపించే మొక్క ఇది. దీని ఆకులు వృత్తాకారంలో ఉండి,కంగోరాలు కలిగి కొంచెం పొడవైన కాడతో ప్రతి కణుపుకు ఒక్కొక్కటి చొప్పున ఉంటాయి. వెన్ను కలిగిన పుష్ప మంజరి వెన్నుగూడా ఆకుపచ్చగానే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో దీనిని"కుప్పింట"చెట్టు అని పిలుస్తారు. ఆకుపసరు నస్యం లా సేవిస్తే శిరోవ్యాధులు పార్సపు నొప్పి తగ్గించే అద్భుత ఔషధమీ చెట్టు. ఇది అంతే కాదు నుసిపురుగుల నివారణకు, ఏలిక పాములు పడిపోవడానికి కూడా ఇది అత్యంత ప్రయోజనకారిగా పేర్కొనబడింది.
ముర్కొండ చెట్టు. :- తాటి కోల పద్మావతి
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి