పాలకూర తోట :- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
పాలకూర తోటలో 
పాలపిట్ట వాలింది 
అటు ఇటు ఎగిరింది 
తోట అంత తిరిగింది 

ఆటలాడ చూసింది
ఆకులన్ని తెంపింది 
గట్టు పైన పెట్టింది 
చుట్టూ తిరిగి చూసింది

బుజ్జి మేక వచ్చింది 
బొజ్జ నిండా మెక్కింది 
గట్టు కిందికి దూకింది 
మే ,మే అని అరచింది

తోటమాలి విన్నాడు 
చేను వద్దకు చేరాడు 
పెరడంతా తిరిగాడు
మేక వద్దకు ఉరికాడు 

పరుగు తీసి వెళ్ళింది 
పరికి పొదలు దాటింది 
పాలపిట్ట రెక్కలిప్పింది 
చెట్టు మీద వాలింది !!


కామెంట్‌లు