విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
విను 
మాట విను 
కానీ పాట వినకు 
సంతోషమో బాధనో కలుగుతుంది!!?

చూడు 
ప్రకృతిని చూడు 
కానీ ఆడపిల్లను చూడకు. 
సంతోషమో బాధనో కలుగుతుంది!!?

మాట్లాడు 
నీతో నీవు 
కానీ మనుషులతో కాదు 
సంతోషమో బాధనో కలుగుతుంది!!?

వ్రాయి
కవితనొ కథనొ
కానీ నీ గురించి రాయకు. 
సంతోషమో బాధనో కలుగుతుంది!!?

సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.

కామెంట్‌లు