నీ బ్రతుకే బ్రతుకు:- కోరాడ నరసింహా రావు!

 అశుభములతో బ్రతికే జనులకు ,శుభములు చే కూర్చుకొరకు...
శిలువకు నీ ప్రాణములను బలి దాన మొసగినావు...
మూడవ దినమున మరలా సంజీవముగ వచ్చి నీవు... 
 నీదు మహిమ జూపినావు
  క్రై స్త వ మనుచు నిన్ను ఆరాధించు వారలకు .... 
 గుడ్ ఫ్రైడే...ఈస్టరు సండే క్రీస్మస్ లను మూడు పర్వ దినము ల నిచ్చి ..., 
శతాబ్ధాలుగా... క్రైస్తవుల గుండెలలో నిలిచి నీవు వున్నావు...! 
    క్రీ స్తూ.... ప్రజల కొరకు బ్రతికిన నీ బ్రతుకే బ్రతుకు! 
   నీ బ్రతుకే నిన్ను ఇలను దేవునిగా నిలిపినది...!! 
 మనిషి బ్రతుకుకు అర్ధము జెప్పిన మహనీయా వందనం...! 💐🙏🙏
  ******

కామెంట్‌లు