శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం :- కొప్పరపు తాయారు

 శ్లోకం: రాహు గ్రస్తదివాకరేందు నదృశోమాయా సమాచ్చాదనాత్
సన్మాత్తః కరణోప సంహారతో  యోః  భూత్సుషుప్తః పుమాన్ !
ప్రాగ్యస్వాప్సమితి ప్రభోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే
 తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్త యే !!

భావం:  రాహువు వలన గ్రహణ సమయమున కాంతి తగ్గినట్టు కనిపించిన, సూర్య తేజము  ఎల్లప్పుడూ అంతే ప్రకాశముగా ఉండును అటులనే బుద్ధి యొక్క పూర్ణశక్తి తన.శక్తిని కోల్పోకుండా కేవలము నిద్రా వస్తయందు నిద్రాణమై ఉండును.ఇదే విధముగా ఆత్మ ప్రకాశము కేవలము మాయచే కప్పబడి ఉండును. ఎలాగైతే  నిద్ర నుండి మేల్కొనిన వ్యక్తి తాను అంతకుముందు నిద్రలో ఉన్నాను మరియు ఆ నిద్రలోనే స్వప్నములు నిజము కావని గ్రహిస్తాడు ఎవరి అనుగ్రహము వలన ఈ ఆత్మ ప్రకాశము కలుగునో శ్రీ గురుస్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
                          *****

కామెంట్‌లు