* నా నీ లు *(కా లం) :- కోరాడ నరసింహా రావు.

  కలిసొచ్చినా
  కాటేసినా... 
   నీ  కర్మల ఫలమే
     నిందించకు కాలాన్ని ! 
       *****
కాలానికి
 నిన్న, నేడు, రేపా... 
   అవన్నీ  మనకే
   కాలం నిత్య నూతనం ! 
     *****
 కాలమేదైన
  సృష్ఠి , స్థితి, లయల
    చక్ర భ్రమణమే
     కేంద్రము మనిషే ! 
    ******
 ఆగక సాగే కాలంతో
    ఎంత పోటీ పడినా
      గెలిచి నిలిచేది
        కాలమే...! 
     *****
పాపం - పుణ్యం
  కష్టం - సుఖం
  అన్నీప్రాణులకర్మ ఫలం... 
    కాలం సాక్షీ భూతం ! 
     *****
కామెంట్‌లు