శ్లోకం:
దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీబాలాంధ జడోపమాస్త్వ హమితి బ్రాంతాభృశం వాదినః !
మాయాశక్తి విలాస కల్పిత మహా వ్యామోహ సంహారిణీ
తస్మై శ్రీ గురు మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్త యే !!
భావం: ఈ శరీరం, ప్రాణం (ప్రాణశక్తి), ఇంద్రియ,అవయవాలు, అస్థిరమైన బుద్ధి లేదా శూన్యతను తమ నిజమైన ఉనికిగా భావించేవారు,అజ్ఞానులైన స్త్రీలు,పిల్లలు, అంధులు, మరియు మూర్ఖులు వలె ఉంటారు. కానీ సత్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు. మాయ. యొక్క శక్తితో సృష్టించబడిన ఈ మాయను ఆయన మాత్రమే నాశనం చేయగలడు. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పి ఆ గురువు అయినా దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారములు.
****

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి