తల్లిదండ్రులు డబ్బును వృధా చేసుకోవద్దు:- ఈర్ల సమ్మయ్య సూచన

 ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలతో పాటు ఉచిత నాణ్యమైన విద్యానందిస్తున్నందున తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. తల్లిదండ్రులు ఆరుగాలం కష్టించి సంపాదించిన వేలాది రూపాయల డబ్బును వృధా చేసుకోవద్దన్నారు. ఫీజుల రూపంలో కట్టే డబ్బును వారి పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలని, అవి పిల్లల భవిష్యత్తు అవసరాలకు ఎంతగానో  ఉపయోగపడతాయని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. మంగళవారం ఆయన ఊషన్నపల్లి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లల్ని ఊషన్నపల్లి బడికి పంపించాలని, చదువుతో పాటు పిల్లల్ని అన్ని విషయాల్లో అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రతిభావంతులైన పిల్లల్ని తయారు చేసినందుకు గాను ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా 'బెస్ట్ స్కూల్ అవార్డు', డీఈఓ చేతుల మీదుగా 'చాంపియన్ స్కూల్ అవార్డు' వచ్చిందని ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రులకు గుర్తు చేశారు. ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చేర్పించాలని ఈర్ల సమ్మయ్య కోరారు.
కామెంట్‌లు