హింసాధర్మం : - శరత్ బాబు ఒజ్జ
ఎవడీ హైందవభూమిపై భయద కాళీయుండుగన్ నిల్చునో 
ఎవడీ ధర్మవినాశనాతృత స్వకాంక్షీయుండుగన్ హెచ్చునో  
ఎవడీ నేలకు వెన్నుపోటు పొడువహ్నేయ్యేలికై తూలునో 
రవమున్ జేయుచు నారసింహుడిగ నేరక్తాక్షుడిన్వానికిన్

ఏమిరా మూర్ఖుడా ఏమేమి టాచర్య 
              లేమేమి రక్కసి లేకిడివవి 
భారతీయుల మెల్ల భాస్వరంబైన నీ 
                ధర్మమేనాడో తా దగిలి పోవు 
హింసనే నీధర్మ హేయమై నిల్చునా 
                 నీ బోధలవిగూడి నిన్ను గూల్చు 
చీడపురుగుగ బెంచిరినిన్ను చిత్రంబు 
                పెంచిన వారికే మంచి లేక
అగ్ని కీలల బడవేసి యంత మొంద 
జేయ క్షణము జాలును మాకు చేత నౌను 
నీచుడవు నిన్నిట సమాధి నేర్పు జేసి 
ధర్మ రక్షణ జేతుమీ  కర్మ భువిన 

ధర్మంబు సహనమందుము 
కర్మంబును సాధనంబుగా నుందుము నీ 
ధర్మమదేమీ హింసన్  
మర్మపు బోధగ సలుపును మైత్ర్యాహితమై

కామెంట్‌లు