సుప్రభాత కవిత : - బృంద
చిమ్మ చీకటి  పాలైన ఇంట
చిక్కులు విడిపోయేలా
చితికిపోయిన చిత్తం
చివురించే వరమిచ్చేలా....

ఆగిపోని కాలంలా 
సాగిపోయే సెలయేరు
తనలో చేరిన దేదైనా
తనదే అనుకునే తీరున...

అన్నీ తెలిసినా 
ఏమీ  చేయలేక 
ఏమీ తెలియకపోయినా 
అన్నీ తెలిసినట్టు....

అనుభవాలు చేసిన
అంతర్మధనాలు
ఆత్రాలు చేయించిన 
అయోమయాలు

ఎన్నో పాఠాలు నేర్పిన 
మలుపులే గురువులుగా 
ఎంతో జాగ్రత్తగా వేసే 
అడుగులే అనునయాలుగా..

బ్రతుకు బాటలో  మజిలీలన్నీ 
ముందు నిర్ణయించబడ్డవనీ
ఏదొచ్చినా నిలవదనీ 
అంతా మనదే! మనకోసమేననీ!

అవగతం చేసుకుని 
అనునిత్యం నడవమనీ 
అందరికీ మరో అవకాశమిస్తూ 
అరుదెంచే అరుణోదయానికి 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు