చెట్టు మనిషి ఆయువు పట్టు:- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు
తల్లిలాంటిది తరువు
మనిషికది ఆదరువు
నరకొద్దు పెద్దయ్య!
నేడే కళ్ళు తెరువు!

కడుపులు నింపుతుంది
అసువులు నిలువుతుంది
స్వచ్ఛ వాయువు పంచి
ఆయువు పెంచుతుంది

కాలుష్యం తరుమును
వానలు కురిపించును
జీవకోటి ఆశ్రయము
చెట్టు వలన క్షేమము

ప్రాణమున్నది చెట్టు
వద్దు గొడ్డలిపెట్టు
స్వార్థాన్ని కట్టిపెట్టు
త్యాగాన్ని చూపెట్టు


కామెంట్‌లు