సెల్లు బానిసలారా..! కళ్ళు తెరవండి..!:- కవి రత్నసాహిత్య ధీర సహస్ర కవి భూషణ్పోలయ్య కూకట్లపల్లి, -అత్తాపూర్, హైదరాబాద్
మొన్న గురువే...
సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరా
గురుదేవా యని పాదపూజలు చేసి
నిన్న ఆ గురువునే తన కాళ్ళకు 
మ్రొక్కమనె భక్తి తలకెక్కిన బాలుడు... 
 
నేడు తన సెల్లు తీసుకున్నందుకు 
ఆవేశంతో పట్టరాని కోపంతో తన 
చదువుల సరస్వతి పైకే చెప్పు విసిరింది 
కళ్ళు తలకెక్కిన ఓ కాలేజీ విద్యార్థిని...

ఔరా ఎంత పొగరు..? ఎంత గర్వం..? 
పిల్లలకేది గురుదేవుళ్ళంటే గౌరవం..? 
 
కోపానికి కొలమానమేది..?
సెల్లుతో రగిలిన రగడకు
"సంస్కారమే" ఒక మౌనసాక్షి...
"ఇది సెల్లు నేర్పిన విష సంస్కృతి...

గురువును చెప్పుతో కొట్టిన విద్యార్థిని
గురువు "పాదాలకు గంధం" పూయాలి
అందరి ముందు "క్షమాపణ" కోరాలి
మరో దురదృష్టకర ఘటన జరక్కముందే
విద్యార్థిని స్కూల్ నుంచి బహిష్కరించాలి...

విద్యాలయాలు అజ్ఞానులకు... 
అహంకారులకు ఆలయాలైతే..?
విషనాగులకు నిలయాలైతే..?
గురువుల గౌరవం గాలిలో దీపమౌతుంది...

సెల్లు ఒక దుర్వెసనం... 
సెల్లుకందరూ బానిసలే...
సెల్లు ఒక మాయాజాలం...
సెల్లు మేధస్సును మింగే ఒక విషనాగు...

ఓ తల్లిదండ్రులారా...
మీ పెంపకానికి ఒక నమస్కారం..
మీ పిల్లలకు నేర్పండి సంస్కారం..

నిఘాలేని నేటి మీ నిర్లక్ష్యం 
మీ గాఢనిద్ర...రేపు మీ పిల్లల 
"పతనానికి పునాది" ఔతుంది...వారి 
బంగారు భవిష్యత్తు అంధకామౌతుంది
జాగ్రత్త జాగ్రత్త ...! తస్మాత్ జాగ్రత్త...!!



కామెంట్‌లు