న్యాయములు-844
"కూర్మ వృత్తిం సమాస్థాయ సర్వత్ర విజయీ భవేత్" న్యాయము
****
కూర్మ అనగా తాబేలు, జప వాయువుల్లో రెండవది. వృత్తిం అనగా కోరిక,కంచె. సమాస్థాయ అనగా నిర్థిష్టమైన స్థితి లేదా రూపంలో ఉండటం.సర్వత్ర అనగా అంతటను.విజయీ భవేత్ అనగా అన్ని చోట్లా విజయం సాధించాలి,/ సాధిస్తాడు అనే అర్థాలు ఉన్నాయి.
తాబేలు వలె మెల్లగా ప్రయత్నము చేస్తూ అన్నింటిలో జయము పొందవలెను.అనగా తాబేలు వలె నెమ్మదిగా ప్రయత్నం చేస్తే అన్నింటిలోనూ విజయం పొందవచ్చు అని అర్థము.
దీనినే ఆంగ్లంలో "slow and study wins the race "అంటారు. అనగా నెమ్మదిగా,స్థిరంగా వుంటే,ఏ పనైనా నెమ్మదిగా, స్థిరంగా చేసినట్లయితే అది విజయవంతంగా పూర్తి అవుతుంది.ఎలాంటి తొణుకూ బెణుకూ లేకుండా పనిచేస్తే అనుకున్న లక్ష్యాన్ని అలవోకగా అధిగమించవచ్చు అనే అర్థంతో మన పెద్దలు ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
తాబేలు, కుందేలు కథ మనందరికీ తెలిసిందే.తాబేలు నెమ్మది నడకను గేలి చేసిన కుందేలు అదెంత దూరం పోతుందిలే అనే ధీమాతో కొద్ది సేపు విశ్రాంతి తీసుకుని లేచి పరుగులు పెట్టిన కుందేలు కంటే ముందే తాబేలు పోటీలో ముందుండి గెలవడం కథ ఇప్పటికీ పిల్లల్ని ఎంతగా ఆకర్షిస్తుందో మనందరికీ తెలిసిందే.
తాబేలు వలె నిదానపు మంచి చెడుల పర్యవసానాన్ని ఊహించి చెసే తలపుల నిర్ణయం విజయానికి దోహదం చేస్తుందనడంలో ఏమాత్రం సందేహము లేదు.అందుకే తాబేలు వలె ఆలోచించాలి అంటారు.
అనగా ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరాలన్నా, పనిని చేయాలన్నా తాబేలు వలె ఓర్పుతో, నిదానంగా మరియు వ్యూహాత్మకంగా ఆలోచించాలి.అంతే కాదు తాబేలు జీవితం ఒంటరి పయనమే. పుట్టినప్పటి నుంచీ తల్లిదండ్రుల ఆలనా పాలనా లేకున్నా తానే స్వంతంగా చుట్టూ ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకొని తనదైన నిర్ణయాలతో జీవిస్తుంది.
తాబేలు నడకలోనూ, సాధికార నిర్ణయంలోనే నిదానం కాదు.యోగులు యోగాలో ఊపిరి పీల్చి, వదిలినట్లుగా నిదానంగా తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలన మానవులతో సమానంగా అత్యధిక కాలం జీవిస్తుంది.
ఈ "కూర్మ వృత్తిం సమాస్థాయ సర్వత్ర విజయీ భవేత్ న్యాయము ద్వారా "దేనికీ ఆరాటపడి, హడావుడి చేయకుండా తాబేలు వలె చేసే ప్రయత్నం,పని,జీవన విధానం వలన అన్నింటిలో జయము, ఆయురారోగ్యాలతో కూడిన జీవితాన్ని గడపవచ్చు అనేది మనం గ్రహించవచ్చు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి