సుప్రభాత కవిత : - బృంద
వేడంతా వెన్నెలతో మాయం
వేకువతో వెన్నెల మాయం
చలిగాలితో అలసట మాయం
వసుమతి శోభలు పరికించని మది ఏలా?

పిలిచే తూరుపు పిలుపు 
ఇలకే  ప్రేమతో  పాడే మేలుకొలుపు 
కదిలే వెలుగుల బంగరు మెరుపు
కనగలిగిన స్వర్గం  మరచుట ఏలా?

కలతలు మరిచి కన్నులు తెరచి 
కనుచూపు మేర పరచుకున్న 
పచ్చని పంటను తిలకించి
వెచ్చని భావన పొందని క్షణమేలా?

ఆకలి తీర్చి ప్రాణం నిలిపే 
ధాన్యమిచ్చే ధరిత్రిని 
మదిలో విధిగా తలచి 
కృతజ్ఞత తెలపని తెలివేలా?

రహదారిని సాగే బాటసారికి 
కన్నుల దాహం తీరేలాగా 
వన్నెలు నిండిన గగనం పలికే 
స్వాగత గీతం అస్వాదించని  మనసేలా?

ప్రతి ఓటమి గెలుపుకో మెట్టు 
ప్రతి అడ్డంకి ఒక అనుభవం 
ప్రతి అంతం ఒక కొత్త ఆరంభం
ప్రతిదినమొక కొత్త అవకాశమని

అందుకు పోవాలని చెప్పే
అరుణోదయానికి

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు