వంకాయ:- - యామిజాల జగదీశ్
 వంకాయ వంటి కూర‌యు, పంక‌జ‌ముఖి సీత‌వంటి భామామ‌ణియున్‌..... అనే ప‌ద్యం తెలుగు వారందరికీ తెలుసు. అంటే.. కూర‌ల్లో వంకాయ వంటి కూర ఇంకొక‌టి ఉండ‌దు.. దానిక‌దే సాటి అని అర్థం వ‌స్తుంది. అయితే క‌వులు చెప్పిన‌ట్లుగానే నిజంగా వంకాయ కూరను వండి తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. భోజ‌న‌ప్రియులు ఎవ‌రైనా స‌రే వంకాయ రుచికి పజిపోవాల్సిందే. ఈ క్ర‌మంలోనే మ‌నం తినేందుకు మార్కెట్‌లో పలు ర‌కాల వంకాయ‌లు ప్ర‌స్తుతం మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే వంకాయ‌లు ఆకృతుల్లో భిన్నంగా ఉంటాయి కానీ క‌ల‌ర్లు మాత్రం రెండే. అవి గ్రీన్, వ‌యొలెట్‌. మ‌రి ఈ రెండు క‌ల‌ర్ల‌లో ఏ ర‌కం వంకాయ‌లను తింటే మంచిదో తెలుసా.... వంకాయ‌ల్లో గ్రీన్ క‌ల‌ర్ కాకుండా వ‌యొలెట్ క‌ల‌ర్‌కు చెందిన వంకాయ‌ల‌ను తిన‌డం మంచిది. ఎందుకంటే సూర్య‌ర‌శ్మిని బాగా గ్రహించి ఆ వంకాయ‌లు పెరుగుతాయి. అందుకే అవి ఆ క‌ల‌ర్‌లో ఉంటాయి. క‌నుక వ‌యొలెట్ క‌ల‌ర్‌లో ఉన్న వంకాయ‌ల‌ను తిన‌డ‌మే ఉత్త‌మం. సూర్య‌ర‌శ్మి గ్ర‌హించబ‌డిన వంకాయ‌ల్లో పోష‌కాలు బాగా ఉంటాయి. అందుకే వ‌యొలెట్ క‌ల‌ర్ వంకాయ‌ల‌ను తినాలి. ఇక వంకాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క్యాన్సర్ రాకుండా చూసుకోవ‌చ్చు. గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్ రాకుండా ఉంటాయి. దీంతోపాటు మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ప‌లు ముఖ్య‌మైన పోష‌కాలు వంకాయ‌ల ద్వారా మ‌న‌కు అందుతాయి.వంగ  లేదా వంకాయ  తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశంలోనూ చాలా ప్రముఖమైన, విరివిగా పెంచబడుతున్న కూరగాయ రకాలలో ఒకటి. ఎప్పుడు ఎలా  మన దేశానికి వచ్చినదో సరిగ్గా తెలీదు. వంకాయలు చిన్న వంకాయలు, పొడుగు వంకాయలు, తెల్ల వంకాయలు, ఎర్ర వంకాయలు, గుత్తి వంకాయలు ఇలా రకరకాలుగా లభిస్తున్నాయి. వంగ మొక్క కాండం సామాన్యముగా 1.25 - 2.50 సెంటీమీటర్ల లావుగా పెరుగుతుంది. దీనికి చాలా కొమ్మలూ, రెమ్మలూ ఉంటాయి. ఆకులు పెద్దవిగా ఉంటాయి. సుమారు 15 సెంటీమీటర్ల పొడువూ, 10 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉంటాయి. కాయల ఆకార, పరిమాణ, వర్ణభేదాలను బట్టి వంగలో అనేక రకాలు గుర్తించారు.  ఆంధ్ర దేశంలో ఆయా ప్రదేశాలలో ప్రత్యేక రకాలుగా పరగణింపబడుతున్న కొన్నిటిని గురించి తెలుసుకుందాం. ముండ్ల వంగ విషయానికి వస్తే దీనిని నీరు పెట్టకుండానే వర్షాధారంగా సాగుచేసుకునే వీలుంటుంది. ఈ రకపు వంగ ఎంతో రుచిగా ఉంటుంది.  ఆత్రేయపురపు వంగ పొడువుగా, సన్నగా ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపుర ప్రాంతంలోని మెట్ట భూమిలో విరివిగా సాగవడంతో ఈ పేరు వచ్చింది
కస్తూరి వంగ తొలకరిలో నాటుతారు. ఆకు పసరువర్ణపు చారలు, బట్టలు కలిగి ఉంటాయి. ఈ కాయలు అంత రుచిగా ఉండవు.
నీటి వంగను శీతాకాలాంతంలో నాటుతారు. ఈ కాయల పొడువులోనూ కొన్ని రకరకాలున్నాయి. గుంటూరు జిల్లాలో వీటిని ఎక్కువగా చూడవచ్చు.  
గుత్తి వంగ చిన్నవిగా కోలగా ఉంటాయి. ఈ కాయపైనే సినిమాలలో ఎన్నో పాటలూ, డైలాగులూ ఉన్నాయి.
వంకాయలో విటమిన్లు, ఖనిజాలు కీలకమైన ఫైటో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వంకాయ పొట్టులో ఉండే ఆంథోసియానిన్ ఫైటో న్యూట్రియెంట్‌ను న్యాసునిన్ అంటారు. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీరంలో ఎక్కువైన ఇనుమును తొలగిస్తుంది. కొలెస్ట్రాల్ నిల్వల్ని తగ్గిస్తుంది. వంకాయలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది . బి.పి.తగ్గించేందుకు వంకాయ ఉపయోగపడుతంది. 

కామెంట్‌లు