దిగులు పడ్డ దిక్కులను
వెలుగులతో నింపేస్తూ
ఎదురుచూచు కన్నులకు
ఎదురొచ్చే వేలుపులా....
ఎరుపు నిండిన తూరుపున
కరువు తీరే కానుకేదో
పొదివి పట్టుకు వస్తున్న
కాంతి కలశపు మెరుపులా..
మురిసిపోతూ మేఘమాలలు
నింగిలో రంగుల తోరణాలై నిలిచి
కదిలి వచ్చు కశ్యపాత్మజుని
కనులలోనే నింపుకుంటూ..
నిన్నలలోని కొదవలు
నేటికి తీరునని
ఏనాటికి తరగని శాంతిని
ఎదలో నిలుపునని....
రగిలే హృదయాలకు
గంధపు పూతగా
కదిలే గుండెల సవ్వడిలో
మెదిలే భావతరంగంలా...
దూరపు కొండల దాపున
వెలిగే వెలుగుల బంతికి
మదిలో జోతలు చేయుచు
కదలిరమ్మని ఆహ్వానిస్తూ....
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి