మండుతున్న గుండెలు :- కొప్పరపు తాయారు
ఇది కాశ్మీరమా? మండుతున్న గుండెలు 
చూడలేక సూర్యుడు కురిపిస్తున్నాడు ఎండ 
మనుషుల హృదయాలు భగ,భగలు
మానవ హృదయాలు మారణ హోమాలు 

బతుకు మీద  ఆశపై , ఆనందాలకై
పరిగెడితే, ఎవరి చితి వారి పేర్చుకున్నట్టై
ఏమి వింత? ఆనందం కోసం పరిగెడితే 
మిగిలెను ఏమిటి ? ఆరని మంటలు 

ప్రాణానికై  అర్ధించచడం, పరిగెత్తడం 
పరిగెత్తాలన్న ఆశ ఉన్నా మింగుతోంది భయం 
భగవంతుడు కూడా మర్చిపోయాడు 
కాశ్మీర్ అంటే ఏమిటో, అందుకే భగభగలు

ఆర్చేవారెవరు? తీర్చేవారు? 
ఏ  శత్రువుకి రా కూడని కష్టం 
ఎందుకు ఈ శిక్ష భారతదేశమా
ఏమైందో చెప్పమ్మా!! నువ్వేనా!



కామెంట్‌లు