కాదేదీ కళా ప్రదర్శన కనర్హం..!:- కోరాడ నరసింహ రావు !
కొబ్బరాకులతో కేవలము 
 పుష్ప వతులకొరకు చాపలే గాదు...
అందమైన పక్షులనూ జేసి ప్రతిభ జూపించే...
  
కొబ్బ రీనెల చీపుళ్ళు...
 కొబ్బరి కాయలను కేవలము నైవేద్య మునకే గాక...
పోషకాహారముగను...
   శ్రేష్ట మైన కొబ్బరినూనెను...
 కొబ్బరి పీచుతో తాళ్ళు గోనె సంచులు గాను...
   ఎండిపోయిన కొబ్బరి మట్టలను సైతం ...
  వంట చెరకుగా వినియోగిస్తూ ...
 కొబ్బరి చెట్టులోని యే భాగమూ వృథా పోదు అని నిరూపించిన...
  ఓ మనిషీ...!
 నీ ప్రతిభ ఎంత గొప్పది !
అందుకే అన్నారు....
 "జంతూ నాం నరజన్మ దుర్లభం...!"
   ఇది సత్యము...!
  నీకు నీవే సాటి...
    రాలేదు ఇంకే ప్రాణీ నీకు పోటీ....!!👏👏👏👏👌👍✌️🤝💐🙏🌷


కామెంట్‌లు