పచ్చగా ఉంటే
ఓర్వలేక
ప్రక్కవారు
పైనచిమ్ముతున్నారు నిప్పులు
ఎదుగుతుంటే
భరించలేక
తోటివారు
వేస్తున్నారు నిందలు
సుఖపడుతుంటే
చూడలేక
పొరుగువారు
వెళ్ళక్రక్కుతున్నారు అసూయను
పేరొస్తుంటే
తట్టుకోలేక
ప్రబుద్ధులు
చల్లుతున్నారు బురదను
అందంగా ఉంటే
ఓర్చుకోలేక
ఎదుటివారు
పెడుతున్నారు శాపనార్ధాలు
చక్కని ఇల్లుకడుతుంటే
సహించలేక
బంధువులు
ప్రదర్శిస్తున్నారు ఈర్ష్యను
మంచిచేస్తుంటే
గిట్టక
ప్రత్యర్ధులు
అంటకడుతున్నారు స్వార్ధము
హితాలు చెబుతుంటే
ఊరుకోక
నచ్చనివారు
మూయిస్తున్నారు వినేవారిచెవులు
సమాజమా
ఎటుపోతున్నావు?
సంఘమా
ఏమిచేస్తున్నావు?
లోకమా
ఏది న్యాయం?
జగమా
ఏమిటి పరిష్కారం?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి