నా సింగిడి:- సాधNa -సాధన.తేరాల,ఖమ్మం.
నా జీవితంలో ఎన్నో రంగులు, 
ఎన్నో రంగులున్న మనసులు తారసపడ్డాయి...  

 రెండు రంగులు మాత్రం నన్ను అలా కట్టిపడేసాయి.

కల్మషంలేని
చిట్టిమనసులను
చిత్రికపడుతున్నాయి.

అవే...
నలుపూ, తెలుపూ
అవే నన్ను తరగతిలో నిలబెడుతున్నాయి.
అవే జ్ఞానప్రవాహానికి
మూలవర్ణాలవుతున్నాయి.
నాకు నచ్చేరంగులు...
నా సింగిడిలోని రెండేరంగులు.
ఈ నలుపూ, తెలుపూ కలిస్తేనే 
అక్షరాలహరివిల్లు ను సృష్టిస్తాయి.

_______


కామెంట్‌లు