కశ్మీరం:- సాधNa సాధన.తేరాల,ఖమ్మం.
కశ్మీరం.....
కుంకం పువ్వు ఎరుపు కాదిప్పుడు
కన్నెర్ర చేసిన నెత్తుటి సింధూరం.


కశ్మీరం....
గడ్డగట్టిన హిమపాతం కాదిప్పుడు 
కరుడుగట్టిన తీవ్రవాదం.

కశ్మీరం.....
కనపడేవి అందమైన కొండలు కాదిప్పుడు
కర్కశం చూపే రాతి గుండెలు.

కశ్మీరం...
భూలోక సుందర ప్రదేశం కాదిప్పుడు 
భయానక శబ్దాలకు నెలవు.

కశ్మీరం....
గగనానవీచే మలయమారుతం కాదిప్పుడు
గన్నులో నింపబడ్డ మందుగుండు.

కశ్మీరం....
నిరంతరం ప్రవహించే జీవనదుల ప్రవాహం కాదిప్పుడు..
ఎప్పటికీ ఆగని భరతమాత కన్నీటి ధార.
_______


కామెంట్‌లు