రాహుల్ సాంకృత్యాయన్- 3:- అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజుల్లో నెత్తిన టోపీలేకుండా బడికెళ్లరాదు.చిన్నారి రాహుల్ నెత్తిన టోపీ నిలిచేది కాదు.ఎక్కడో పడిపోయి దొరికేదికాదు. తాతకోపంతో గంతులు!చొక్కాకు టోపీకి పిన్నీసు పెట్టినా టాకాలు వేసినా తాత్కాలికమే!ఐనా పిల్లాడికి చిరాకుగా ఉండేది.ఒక సారి తాతకుట్టించిన పట్టుటోపీ జారిపోయి మాయమైంది. నాల్గోరోజే పోగొట్టుకొన్న రాహుల్ తాత తంతాడనే భయంతో ఇంటికెళ్లకుండా ఒకరింట్లో పడుకొన్నాడు.ఆగృహస్థు చాలా బీద వాడు.పైగా చలికాలం అందుకని ఒక గోనెసంచీఇచ్చాడు. అందులో దూరి పడుకొన్నాడు రాహుల్.బడికి ఊరికి కనీసం 2_3మైళ్ల దూరం.తాతగారు వెతుక్కుంటూ వచ్చారు.మనవడిని చూసి ఆయన గుండె కరిగినీరైంది."పోతే పోయిందిలే టోపీ! " అని తాత ఊరడించి ఇంటికి తీసుకెళ్లాడు.టోపీని చొక్కా కే గట్టిగా కుట్టించారు ఆయన.! ,రాహుల్ కుశాగ్ర బుద్ధి ,చురుకుదనం చెప్పుకొని తీరాలి. ఏడాది పొడుగునా చదివేపుస్తకాల్ని  మూడునెలల్లో కంఠస్థం చేసేవాడు.అందుకే పుస్తకాలు ముట్టాలంటే విసుగు.కానీ అమ్మమ్మ తాత లు చెప్పే కథలు శ్రద్ధ గా ఆసక్తిగా వినేవాడు.కానీ తాత చెప్పిన కథే మళ్లీ మళ్లీ సాగదీసి చెప్పడంతో పెడచెవిన పెట్టేవాడు.ఆరోజుల్లో డిసెంబర్ సెలవులకి నాన్న దగ్గర కి పరుగెత్తేవాడు.తెల్లారింది మొదలు చీకటిపడేదాకా ఆటలు! ఆకలేస్తేనే వచ్చి అన్నంతిని ఆటలకు పరుగులు! ఇలా సెలవులు ఇట్టే గడిచి పోయేవి.
సశేషం
కామెంట్‌లు