విక్రమ ధీర -4 : - భరద్వాజ్ , సెల్ : 7075451597

 చందు  తన చేతిలో ఉన్న ఆ బొమ్మను చూసి ఆశ్చర్యపోతాడు. "ఈ బొమ్మ ఇక్కడకి  ఎలా వచ్చింది?.. అసలు ఆ పెయింటింగ్ ఎక్కడికి మాయమైంది.. . ? అని తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఆ బొమ్మ అతను చూసిన పెయింటింగ్ లోని బొమ్మలాగే ఉండడంతో , ఆశ్చర్య పోతూ.. “ అంటే , ఆ పెయింటింగ్ ఇలా బొమ్మ లా మారిందా.. నేను ఇది నమ్మలేక పోతున్నాను.. “ అని ఒక నిమిషం ఆశ్చర్యనికి గురి అవుతాడు..
 

     తరువాత మళ్ళీ ఆలోచిస్తూ, “ ఖచ్చితంగా ఈ బొమ్మ వెనకాల ఏదో పెద్ద రహస్యమే దాగుంది.. ఎలాగైనా అదేంటో కనిపెట్టాలి.” అని అలా ఆలోచనలో ఉండగా, అపుడే అతని ఆలోచనలకు బ్రేక్ వేస్తూ, అతని ఫోన్ రింగ్ అవుతుంది.. 
 

  అది ఓల్డ్ మోడల్ కీ పాడ్ ఫోన్.. దానికి రెండు రబ్బర్ బ్యాండ్ లు వేసి ఉన్నాయి.. ఆ ఫోన్ చూస్తే అర్థం చేసుకోవచ్చు, చందు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నాడో.. అతి కష్టం మీద పని చేయని ఫోన్ కీని గట్టిగా నొక్కుతూ కాల్ అటెంప్ట్ చేస్తాడు.. అటు వైపు నుంచి.. 
 

     “ హలో మిస్టర్ చంద్ర శేఖర్.. నేను hsc బ్యాంక్ మేనేజర్ ని మాట్లాడుతున్నాను.. “ అని ఒక పోలైట్ గొంతు వినిపించగానే, చందు వెంటనే , “ సార్ చెప్పండి.. “ అని అంటాడు.. అపుడు బ్యాంక్ మేనేజర్ .. “ మీరు మీ ప్రింటింగ్ హౌస్ రెనోవేసన్ కి లోన్ అప్లై చేశారు కదా..” అని అడుగుతాడు.. దానికి చందు “ అవును సార్, కానీ మీకు లోన్ ఇవ్వడం కుదరదని ఏవో రీజన్స్ చెప్పి మీరే రిజెక్ట్ చేశారు కదా..” అని అంటే, దానికి ఆ మేనేజర్.. “ సారీ ఫర్ ధి ట్రబుల్ సార్.. అది బ్యాంక్ సర్వర్స్ సరిగ్గా వర్క్ చేయక అపుడు క్యాన్సిల్ అయింది సార్.. బట్ ఇపుడు మాత్రం మీకు 30 lakhs లోన్ సాంక్షన్ అయింది సార్.. ఆ విషయం చెబుదామనే కాల్ చేసాను.. మీరు ఒక సారి బ్యాంక్ వచ్చి కలవండి.. ఫార్మాలిటీస్ కంప్లీట్ చేద్దాం..” అని కాల్ కట్ చేస్తాడు బ్యాంక్ మేనేజర్.. చందు ఇంకా ఆ విషయం నమ్మలేనట్లు షాక్ లోనే ఉంటాడు..
 

    చందు అలా షాక్ లో ఉండగానే, అతని మైండ్ ని బ్లాంక్ చేసే మరో ఫోన్ కాల్ వస్తుంది.. ఫోన్ లో ఆ నెంబర్ చూడగానే చందు మళ్లీ షాక్ అవుతాడు.. ఎందుకంటే కాల్ చేసింది తనని తన ప్రేమని కాదని 2 ఇయర్స్ బ్యాక్ వదిలేసి వెళ్లిపోయిన అంజలి.. ఈ రెండేళ్లలో ఒక్క సారి కూడా అతనికి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయని అంజలి.. ఇంత సడెన్ గా ఫోన్ చేస్తుంటే.. అతనిలో ఏదో తెలియని భయం మొదలైంది.. అతని చేతులు వణుకుతున్నాయి.. అలా వణుకుతున్న చేతులతో నే, ఫోన్ లిఫ్ట్ చేస్తాడు.. తడబడుతూనే..
“ హాల్ అంజలి.” అని అంటాడు.. 
 
అపుడే అటు వైపు నుంచి.. ఏడుస్తున్న గొంతు తో . “ చందు.. I'm so sorry చందు.. నిన్ను చాలా బాధ పెట్టాను.. నీ దగ్గర డబ్బు లేదని నిన్ను ఎంతో అవమానించాను.. నీతో బతకలేనని నీకు దూరంగా వచ్చేసాను.. కానీ నీకు దూరంగా వచ్చాకే నీ విలువేంటో నాకు తెలిసింది చందు.. నాకు నువ్ కావాలి.. మనం పెళ్లి చేసుకుందాం.. ఇవాలే నేను అమెరికా నుంచి వస్తున్నాను.. అమ్మ నాన్నతో కూడా చెప్పేసాను.. వాళ్ళు కూడా మన పెళ్లికి ఒప్పుకున్నారు..” అని చందు ని మాట్లాడ నివ్వకుండానే తనే మాట్లాడి ఫోన్ కట్ చేస్తుంది.. ఆ ఫోన్ కట్ అయిన కాసేపటి కి చందు తేరుకుని.. 
 

   జరిగింది మొత్తం గుర్తుకి తెచ్చుకుని తనని తాను గట్టిగా గిల్లుకుని.. “ అబ్బా..” అని గట్టిగా అరిచి..  
“ ఇదంతా కల కాదు.. నిజమే..” అనుకుని, తన చేతిలో ఉన్న బొమ్మ వైపు చూసి.. “ ఇదంతా ఈ బొమ్మ వల్లే.. ఈ బొమ్మ నా లైఫ్ లోకి రాగానే ఇంత మిరాకిల్ జరిగింది అంటే,ఇది పూర్తిగా నాతోనే ఉంటే నేను ఎక్కడికో వెళ్లి పోతాను.. ఒరేయ్ చందు ఇకపై నీ జాతకం మొత్తం మారిపోయింది.. “ అని మురిసి పోతాడు.
 
రామ్ చేతిలో ఉన్న బొమ్మ రామ్ నుంచి విడిపోవడం, స్కూల్ బస్సు బ్రిడ్జ్ నుంచి కింద పడటం ఒకే సారి జరిగి పోయాయి.. ఆ బస్సు నీటిలో చాలా లోతుకు మునిగి పోయింది..బస్సులోపల ఉన్న పిల్లలు అందరూ నీటిలో మునిగి పోతూ బయటకి వెళ్లే మార్గం లేక నీటిలో మునిగి పోతూ గిల గిల కొట్టుకుంటున్నారు.. 
 

డ్రైవర్ ఇంకా అందులో ఉన్న ఆ పిల్లల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు.. 
  బ్రిడ్జ్ మీద వెళ్తున్న కొంత మంది ఈ విషయాన్ని పోలీసులకి చెప్పడానికి ఫోన్ చేస్తే, ఇంకొంత మంది తమ ఫోన్స్ లో షూట్ చేస్తూ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. ఆ సంఘటన జరిగిన కొన్ని నిమిషాలలోనే అక్కడకు పోలీసులు , అంబులెన్స్ ఇంకా మీడియా వాళ్ళు అక్కడకు చేరుకున్నారు.. si స్వామి పోలీస్ జీప్ దిగిన వెంటనే వాళ్ళకి కాల్ చేసిన వ్యక్తి నేరుగా స్వామి దగ్గరకి వెళ్ళి, 
“ నమస్తే సార్.. మీకు కాల్ చేసింది నేనే..” అనగానే, si అతని వైపు కింది నుంచి పై దాకా చూసి.. “ ఎలా జరిగింది..” అని అడుగుతాడు..  “ బస్ బ్రిడ్జి మీద వెళ్తుంది సార్.. ఏమైందో తెలీదు కానీ ఉన్నట్టుండి సడెన్ గా డివైడర్ ని గుద్దుకుని నీటిలో పడి పోయింది సార్.. దాదాపు ఒక 30 మంది దాకా పిల్లలు 5,6 మంది టీచర్స్ ఉంటారు సార్..” అని ఆ వ్యక్తి సమాధానం ఇస్తాడు.. తరువాత si స్వామి.. “ ఇంతకీ ఏ స్కూల్ బస్ అది.”
అనగానే, “ ప్రగతి ఇంటర్నేషనల్ స్కూల్ సార్..” అని అనగానే, si వెంటనే కానిస్టేబుల్ వైపు చూసి “ వెంటనే ఆ స్కూల్ యాజమాన్యం కి కాల్ చేసి ఇన్ఫర్మ్ చేయండి.. అలాగే ఆ పిల్లల పేరెంట్స్ కి కూడా ఇన్ఫర్మ్ చేయండి..” 
అని , మళ్లీ మాట్లాడుతూ.. “ గజ ఈత గాళ్ళు వచ్చారా..” అని అంటాడు si స్వామి.. దానికి కానిస్టేబుల్ .. “ వచ్చారు సార్. ఆల్రెడీ పని మొదలు పెట్టారు..” అని అంటాడు.. 
 

    మరో వైపు మీడియా వారు ఆ న్యూస్ ని కవర్ చేస్తున్నారు.. “ ఇవాళ ఉదయం గాంధీ నగర్ బ్రిడ్జ్ దగ్గర ప్రగతి ఇంటర్నేషనల్ స్కూల్ బస్ ప్రమాద వశాత్తు నదిలో పడి పోయింది..ఈ సంఘటనతో అటు స్కూల్ యాజమాన్యం, ఇటు పిల్లల తల్లి దండ్రులు ఆందోళనలో ఉన్నారు
అని అన్ని న్యూస్ ఛానెల్స్ లో చూపిస్తున్నారు.. 
 

   కొద్ది సేపట్లోనే, అక్కడికి స్కూల్ యాజమాన్యం తో పాటు పిల్లల తల్లి దండ్రులు కూడా చేరుకున్నారు.. మరో వైపు రామ్ పేరెంట్స్ విక్రాంత్ మైరా లు కూడా అక్కడకి చేరుకున్నారు.. నీటిలోకి వెళ్లిన గజ ఈత గాళ్ళు ఒక్కొక్క విద్యార్థి ని కాపాడి ఒడ్డుకు  తీసుకు వస్తున్నారు.  రామ్ కోసం ఏడుస్తూ రామ్ కి ఏం కాకూడదు అని, మైరా మనసులోని దేవుణ్ణి వేడుకుంటుంది.. మరో వైపు విక్రాంత్.. రామ్ కి ఏం కాదు ధైర్యంగా ఉండు అని మైరా ని ఓదారుస్తున్నాడు.. 
 

      మరో వైపు నీటిలో ఛారీ చెయ్యి పట్టుకుని ఉన్న రామ్, తన చేతిని వదిలేయడం తో ఇంకా అడుగుకి వెళ్లి పోతాడు.. గజ ఈత గాళ్ళు టీచర్స్ సహాయం తో పిల్లలు అందర్నీ.. కాపాడి ఒడ్డుకి తెచ్చి వాళ్ళకి కావాల్సిన ట్రీట్ మెంట్ ఇస్తున్నారు.. ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు.. నీటి అడుగున ఉన్న రామ్ ఎక్కడైతే ఆ బొమ్మ పడి పోయిందో.. అక్కడకి వెళ్లి పడతాడు.. రామ్ చెయ్యి ఒక్క సారిగా ఆ బొమ్మని తాకగానే, తను ఎప్పుడు కనే కలే తన కళ్ళముందు ఫ్లాష్ అవుతుంది.  అడవి తగలబడి పోవడం.. మునీశ్వరుడి శాపం.. ఇవన్నీ ఫ్లాష్ అయ్యి వెంటనే కళ్ళు తెరుస్తాడు.. 
 
 
అందరినీ కాపాడి రామ్ ని కాపడక పోయే సరికి విక్రాంత్ అండ్ మైరా లో మరింత కంగారు పెరిగి పోతుంది.. వెంటనే si దగ్గరికి వెళ్లి.. “ సార్, మా బాబు రామ్ ఇంకా నీళ్ళల్లో నే ఉన్నాడు సార్.. వాన్ని కాపాడండి..” అని విక్రాంత్ అనడం తో, si ఒక ఈత గాన్ని నీటిలోకి వెళ్లమంటాడు.. అతను నీటిలోకి వెళ్లి నీటిలో మొత్తం వెతుకుతూ ఉంటాడు.. ఇటు మైరా, విక్రాంత్ ఇద్దరిలో రామ్ కి ఏం అవుతుందో అన్న కంగారు మరింత పెరిగి పోతుంది..
 

    మరో వైపు నీటిలో కళ్ళు తెరచిన రామ్ , ఆ బొమ్మని చేతిలోకి తీసుకోగానే, రామ్ కి తనలోకి ఏదో తెలీని పవర్ వచ్చింది అని ఫీల్ అవుతాడు.. తరువాత నేల మీద నడిచినట్లే నీటిలో కూడా మాములుగా నడవ గలుగుతున్నాడు రామ్. అతనికి అంతా ఆశ్చర్యంగా ఉంది.. అపుడు అనిపిస్తుంది రామ్ కి ఆ బొమ్మ మాములు బొమ్మ కాదని.. అందులో ఏదో శక్తి దాగి వుందని.. అది ఏమై ఉంటుందా అని నీటిలో నడుస్తూనే ఆలోచిస్తుండగానే ఒక్క సారిగా నీటిలో ఒక పెద్ద వెలుగు రావడం తో రామ్ నీటిలో మాయం అవుతాడు.. 
 
నీటిలో చాలా సేపు వెతికిన గజ ఈత గాడు బయటకు వచ్చి నీటి లోపల ఇంకెవరు లేరని చెప్తాడు.. అది విన్న మైరా, విక్రాంత్ ల గుండె పగులుతుంది.. 
 

   నెక్స్ట్ ఏం జరుగుతుంది.. ? రామ్ ఎక్కడికి మాయం అయిపోయాడు.. ? చందు కి దొరికిన బొమ్మ ఎవరిది.. ? రామ్ కి వచ్చిన పవర్స్ వల్ల అతనేమైన సమస్యలు ఎదుర్కో బోతున్నాడా.. ? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు కావాలంటే  విక్రమ ధీర నెక్స్ట్ చాప్టర్ చదివేయండి..


కామెంట్‌లు