పుస్తక ప్రపంచం41: - సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 దిగులాగ్ఆర్కిపెలాగొ 1929_1953 దాకా రష్యాలో జరిగిన మారణకాండ,వేలాది ప్రజలు బందీలుగా పడిన అష్టకష్టాలు వర్ణించిన చారిత్రక డాక్యుమెంట్! అలెగ్జాండర్సోల్జెన్సిన్ స్టాలిన్ దురాగతాల్ని భవిష్యత్ తరాలకి తెలపాలని చేసిన రచన! చిత్ర హింసలు,హత్యలు పైశాచిక వాతావరణం నుంచి ఎలాగో తప్పించుకొన్న ఆయన రాసిన యధార్ధగాథ భీతికల్గిస్తుంది.1973 లో ఫ్రాన్స్ లో పబ్లిష్ ఐంది.గులాబ్ అంటే జనాల్ని కుక్కిన కాంప్స్! ఆనాటి సోవియట్ యూనియన్ లో ద్వీపాలలాగా  ఈ శరణార్ధుల శిబిరాలుండేవి. ఆనాటి దేశ పరిస్థితులకు దర్పణం ఈపొత్తం. ప్రఖ్యాత ఆంగ్ల నాటకకర్త జార్జి బెర్నార్డ్ షా జోన్ ఆఫ్ ఆర్క్ పై రాసిన నాటకంప్రశంసలు పొందింది.సెయింట్ గా ఆమె గుర్తింపుపొందిన మహిళాశిరోమణి. పులిట్జర్ బహుమతిపొందిన బిలౌవ్డ్ రచయిత్రి టోనీ మారిసన్.ఫ్లాష్ బాక్స్ తో ఆనాటి బానిస బ్రతుకుని హృద్యంగా చిత్రించిందామె.గుండెను పిండే సన్నివేశాలెన్నెన్నో! సెథె అనే బానిస మహిళ తన చిన్నారిని చంపేస్తుంది. ఆపసిది బానిస గా బ్రతకరాదు అనే ఆవేదనతో చంపుతుంది. సివిల్ వార్ మొదలవటానికి కారణం ఐంది ఈపుస్తకం.సెథె తన అనుభవాలు,నిజాలు గుప్పించింది.నీగ్రోల బ్లాక్ పీపుల్ దుర్భర జీవితాలు,వేదనలు కన్నీరు పాఠకుల గుండెను పిండే లా వర్ణించిందామె🌹
కామెంట్‌లు