ఆంగ్లంలో సైన్స్ ఫిక్షన్ కి పెట్టింది పేరు హెచ్.జి.వెల్స్.తన సామాజిక రాజకీయ దృక్కోణాల్ని ఇందులో స్పష్టంగా చిత్రించిన మేధావి.దిటైంమిషన్ క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ అద్భుతమైన ఊహలు ఆలోచనలు రేకెత్తిస్తూ పాఠకుల్ని వేరేలోకాలకి తీసుకుపోతుంది.
జాన్ మిల్టన్ రాసిన పారడైజ్ లాస్ట్ ని ఎపిక్ పోయెమ్ గా ఆదరించారు జనం.దేవుడు,జీసస్,శాటన్, యాడం ఈవ్..ముఖ్య పాత్రలు.17వ శతాబ్దపు ఆంగ్లం కాబట్టి కొరుకుడు పడటం కష్టం.నేటి ఆంగ్లంకి కాస్త భిన్నం.అంటే మన గ్రాంథిక తెలుగులాగా అని చెప్పొచ్చు.మిల్టన్ భాషలో కొత్త భావాలు,పదాలు నేటికీ మనం వాడుతున్నాం.All Hell broke loose పారడైజ్ లాస్ట్ లో వాడిన పదం నేటికీ వాడబడ్తోంది.
మనతెలుగులో కూడా మంచి సాహిత్యం ఉంది.కాకపోతే హిందీ ఇంగ్లీష్ లో అనువాదం కాకపోవడంతో మనదేశంలోనే చాలామందికి తెలీదు.బెంగాలీల చొరవతో ఆంగ్లంలోకి చాలా కథలు నవలలు అనువాదం చేయబడ్డాయి. తెలుగులో హిందీలో కి అనువదింపబడినాయి.
పుస్తక ప్రపంచం45:- సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి