పుస్తక ప్రపంచం 47సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 *దిజంగిల్బుక్*రాసిన రుడ్యార్డ్ కిప్లింగ్ నేటికీ ఆబాలగోపాలంకి చిరపరిచితుడు. ఇది నీతికథ లతో జంతువుల పాత్రలతో నడిచిన కథల పుస్తకం.ధైర్య సాహసాలు,నీతినిజాయితీ ఇలా పిల్లల కి నచ్చేవిధంగా రాసిన పుస్తకం.ఇందులో ముఖ్య పాత్రలు మొగ్లీ, తోడేళ్లచేత పెంచబడిన పిల్లవాడు ఇంకా ముంగిస ఏనుగుమొదలైన పాత్రలకలబోత! రిక్కి- టిక్కి-టవి పాత్రల పేర్లు అలరిస్తాయి.11వశతాబ్దికి చెందిన ఒమర్ ఖయాం రాసిన దిరుబాయత్ 700ఏళ్లతర్వాత ఆంగ్లంలోకి ఎడ్వర్డ్ ఫిట్జ్ గెరాల్డ్ అనువాదంచేసి ప్రపంచ వ్యాప్తంచేశాడు. కవి మానసిక భావాలు,వేదన ప్రేమ చావు_ఇలాకేవలం 4లైన్ల పద్యంలో ఒదిగింది.ఫార్శీభాషలో రుబై గారాయబడినకవితలవి.క్రీ.శ.62లో రోమన్ వాడైన ఎపిసియస్ వంటలగూర్చి రాసిన పుస్తకం" డెరెకోక్వినరియా".నాటి చక్రవర్తి క్లాడియస్ రకరకాల వంటకాలు,వాటిరుచుల్ని ఆస్వాదిస్తూ లొట్టలేస్తూ తినేవాడట! అలా తొలివంటల పుస్తకం ప్రారంభమై నేడు పుంఖానుపుంఖాలుగా రుచులు అభిరుచుల వంటల పుస్తకాలు కనువిందు చేస్తున్నాయి.ఒకప్పుడు మాలతీచందూర్ గారి వంటలు పిండివంటలు లైబ్రరీలో ఉండేది.ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమా అని అబ్బాయిలు కూడా గరిటెలు తిప్పుతూ నవకాయవంటకాలు వండేస్తున్నారు. 🌹
కామెంట్‌లు