పుస్తక ప్రపంచం 48 సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ప్రపంచమంతటా కొనియాడబడే అవసరమైన పుస్తకం.250ఏళ్లకు పైగా కావల్సిన సమాచారాన్ని ఠక్కున అందించే అపురూపమైన గ్రంథం.1768 లో ఎడిన్ బర్గ్ లోమూడు వాల్యూంలుగా ప్రచురించబడింది.1901లో ఇద్దరు అమెరికన్స్ దాన్ని ఇంకా అభివృద్ధి చేసి లోకవ్యాప్తం చేశారు.1929లో యు.ఎస్.లో ప్రింట్ అవడంతోపాటు ప్రపంచంలోని విద్యావేత్తలు పండితుల భాగస్వామ్యంతో  దినదినాభివృద్ధి చెందుతోంది. ఎప్పటికప్పుడు అప్ట్ డేట్ చేయబడ్తుంది. 100పైగా ఎడిటర్స్,4వేలపైగా కంట్రిబ్యూటర్స్ ఉన్న ఈపొత్తం స్పృశించని అంశం ఉండదు.చిన్న పెద్ద కి అన్నిరంగాలవారికి ఉపయోగ పడే గ్రంథరాజం; తొలుత సాహిత్యమంతా మధ్యధరాప్రాంతంలోనే విలసిల్లింది. 9వశతాబ్దిలో ఐస్ బెర్గ్ ప్రస్తావన సాహిత్యంలో రావడానికి కారణం నాగరికతలు కొత్త పుంతలు తొక్కటమే.మన వేదాలు పురాణాలలోని విషయాన్ని జర్మనీ వారు గ్రహించి ప్రపంచానికి తెల్పారు.మనం ఇప్పటికీ మన కావ్యాలు పవిత్ర గ్రంథాలని చిన్న చూపు చూడటం బాధాకరం.పిల్లలకి రామాయణ భారతాలు అందులోని వ్యక్తులపేర్లు తెలీని దౌర్భాగ్య స్థితి నేడు దాపురించింది🌹
కామెంట్‌లు